Movie News

రాజమౌళి నిరాశని నాగార్జున తీర్చిన వేళ

అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ఇవాళ రాజమౌళి అతిధిగా నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులు కార్యక్రమంలో పాలు పంచుకోగా జక్కన్న చెప్పిన అనుభవం ఆశ్చర్యపరిచింది. ఆర్ఆర్ఆర్ ని డాల్బీ విజన్ టెక్నాలజీలో మార్చాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన సాంకేతిక ఇండియాలో లేదని తెలిసి ట్రిపులార్ బృందం జర్మనీకి వెళ్లి చేయించుకోవాల్సి వచ్చింది. ఇంత గ్రాండియర్ తీసినా స్వంత దేశంలో ఇలాంటి సౌకర్యం లేకపోవడం చూసి రాజమౌళి నిరాశ చెందారు. ఇప్పుడు హైదరాబాద్ కే వచ్చేసింది.

సాధారణ 4Kతో పోలిస్తే డాల్బీ విజన్ నాణ్యత, సౌండ్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. స్క్రీన్ మీద ప్రతి డీటెయిల్ స్పష్టంగా కనిపిస్తుంది. తల వెంట్రుకల మీద చివరి అంచును కూడా క్రిస్టల్ క్లియర్ గా చూడొచ్చు. రంగులు సహజత్వంతో ఉండి సినిమాలో సందర్భానికి తగ్గట్టు వాటికి మరింత అందం తీసుకొస్తాయి. ఒక్కసారి చేయిస్తే శాశ్వతంగా ఆ ప్రింట్ ఉండిపోతుంది. రాజమౌళినే కాదు చాలా మంది ఫిలిం మేకర్స్ డాల్బీ విజన్ కోసం ఇతర దేశాలకు వెళ్లొస్తున్నారు. బడ్జెట్ భారమైన వాళ్ళు రాజీపడిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అన్నపూర్ణ వేదిక కావడంతో అందరూ ఇక్కడికే వస్తారు.

రాజమౌళి చేస్తున్న మహేష్ బాబు 29 పనులు ఇక్కడే జరుగుతాయని వేరే చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ ప్రత్యేకమైన ఫుటేజ్ ని ఈ సందర్భంగా స్క్రీనింగ్ చేయడం విశేషం. డాల్బీ లాబరేటరీ పర్యవేక్షణ, సహకారంతో కార్యకలాపాలు జరుగుతాయి. ఇప్పటికే సినిమా స్క్రీనింగ్ లో పలు విప్లవాత్మక మార్పులు వస్తున్న నేపథ్యంలో నాగార్జున వేసిన ముందడుగు మెచ్చుకోదగినదే. అయితే డాల్బీ విజన్ చేయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి కెమెరాలను సపోర్ట్ చేస్తుందనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవలే ఈటీవీ విన్ కిరణ్ అబ్బవరం కని డాల్బీ విజన్ లో విడుదల చేసింది.

This post was last modified on January 11, 2025 10:15 am

Share

Recent Posts

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

2 hours ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

3 hours ago

కొత్త దారులు వెతకాలి విశ్వంభరా

వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…

3 hours ago

సర్దార్ చేసిన గాయం చాలా పెద్దది

మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…

4 hours ago

మెగా అప్‌డేట్…. మిసెస్ కాకా వచ్చేశారా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…

5 hours ago

గణేష్ నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి

ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…

5 hours ago