ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా చెప్పారో రిలీజ్ కు ముందు చూశాం. తీరా ఇవాళ గేమ్ ఛేంజర్ థియేటర్లలో ఆ పాట లేదు. నిన్నటి దాకా ఈ విషయం బయటికి చెప్పలేదు కానీ ప్రీమియర్లు మొదలైన కాసేపటికే సమాచారమిచ్చారు. సాంకేతిక కారణాల వల్ల మెరుగైన క్వాలిటీ కోసం ఆలస్యమయ్యిందని, జనవరి 14 నుంచి జోడిస్తామని ప్రకటించారు. గత ఏడాది దేవరలో దావూదికి కూడా అచ్చం ఇలాగే జరిగింది. ముందు లెన్త్ కోసం వద్దనుకుని ఓ పది రోజుల తర్వాత యాడ్ చేయడం కొంత మేర మంచి ఫలితమిచ్చింది.
కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ కు ఆ అవకాశం ఫస్ట్ హాఫ్ లోనే ఉంది. కానీ నిడివి దృష్ట్యా ఇప్పుడు హైరానాని జోడిస్తే అది టాక్ పరంగా మరింత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. నిజానికి హైరానా చాలా ఖరీదైన పాట. అరుదైన విదేశీ లొకేషన్లలో భారీ బడ్జెట్ తో షూట్ చేశారు. జరగండి జరగండి తర్వాత అంత ఖర్చు పెట్టింది దీనికే. మ్యూజిక్ లవర్స్ కి బాగా కనెక్ట్ అయిన ఛార్ట్ బస్టర్. రామ్ చరణ్, కియారా అద్వానీల కెమిస్ట్రీ బాగా కుదిరిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు. తీరా చూస్తే తెరమీద లేకపోవడం కొంత నిరాశ పరిచే విషయమే. ఇంకో నాలుగు రోజులు ఆగితే కానీ మళ్ళీ చూసే ఛాన్స్ లేదు.
ఏది ఏమైనా ప్యాన్ ఇండియా సినిమాలు ఇలాంటి విషయాల్లో ముందు జాగ్రత్త వహించాలి. లేకపోతే ఫ్యాన్స్ అసంతృప్తిని చవి చూడాల్సి వస్తుంది. బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు కానీ మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం దాని ఎఫెక్ట్ మాములుగా ఉండదు. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ స్టేటస్ మీద ఇప్పుడే ఒక అంచనాకు రాలేకపోయినా ప్రస్తుతమున్న స్పందన చూస్తుంటే ఇంకా మెరుగుపడాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. సంక్రాంతి బరిలో ముందుగా రావడం వల్ల థియేటర్లు, షోలు భారీగా దక్కించుకున్న గేమ్ ఛేంజర్ వాటికి సార్ధకత చేకూరాలంటే కనీసం రెండు వారాల పాటు బలమైన రన్ కొనసాగించాలి. పోటీలో ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on January 10, 2025 1:11 pm
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఒంటరి ప్రయాణాన్ని తప్పించుకునేలా కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…
బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు భిన్నమైన ఆదేశాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఏపీలో…
స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు నో.. తేల్చేసిన సుప్రీంస్వలింగ వివాహాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన పిటిషన్లపై కీలక…