Movie News

లెక్క తప్పుతున్న అజిత్ ప్లానింగ్

తలా అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే అజిత్ ఏడాదికి ఒక సినిమా చేయడమే మహా గగనం. అలాంటిది కేవలం మూడు నెలల గ్యాప్ లో రెండు ప్యాన్ ఇండియా మూవీస్ వస్తాయంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ 10 విడుదల లాక్ చేస్తూ ఇటీవలే అధికార ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి పొంగల్ కు వద్దామనుకుంటే విడాముయార్చి కోసం వాయిదా వేసుకున్నారు. తీరా చూస్తే అది కూడా పోస్ట్ పోన్ కావడంతో విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ నిర్ణయం మార్చుకోలేక కొత్త డేట్ చూసుకున్నారు. ఇప్పుడో కొత్త ట్విస్ట్ వచ్చింది.

తాజాగా విడాముయార్చి సెన్సార్ పూర్తి చేసుకుంది. రెండున్నర గంటల నిడివితో యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు. జనవరి నెలాఖరు రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచన జరుగుతోంది. దాదాపు ఖరారైనట్టేనని చెన్నై టాక్. అదే జరిగితే దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీకి మధ్య చాలా తక్కువ గ్యాప్ వస్తుంది. కానీ కోలీవుడ్ ఎగ్జిబిటర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం. ఎందుకంటే అజిత్ లాంటి పెద్ద రేంజ్ హీరో ఒకేసారి రెండు సినిమాలతో వస్తే భవిష్యత్తులో ఎక్కువ గ్యాప్ వస్తుంది. అసలే విజయ్ రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు. భవిష్యత్తులో తిరిగి వస్తాడో రాడో గ్యారెంటీ లేదు. ఎవరూ చెప్పలేరు.

రజనీకాంత్ ప్రస్తుతమున్న స్పీడ్ కొనసాగిస్తారో లేదో తెలియదు. అలాంటిది అజిత్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వస్తే మళ్ళీ ఎప్పుడు దర్శనం జరుగుతుందోనని ఫాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతానికి దీనికి పరిష్కారం లేదు. అయితే విడాముయార్చికి గుడ్ బ్యాడ్ అగ్లీ మీద ఉన్నంత బజ్ లేదు. టీజర్ చూశాక పెద్దగా అంచనాలు నెలకొనలేదు. అందుకే వాయిదా వేసి తర్వాత రిలీజ్ చేయమని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి పది పదిహేను సినిమాలు చేసినా జనం చూసేవారు. ఇప్పుడు రెండు వచ్చినా సరే బయ్యర్లు టెన్షన్ పడే పరిస్థితి వచ్చింది. కాలమహిమ.

This post was last modified on January 9, 2025 5:51 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

4 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

6 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

6 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

7 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

7 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

8 hours ago