‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్‌బస్టర్లతో విజయ్ దేవరకొండ మాంచి ఊపు మీద ఉండగా.. అతడికి బ్రేకులేసిన చిత్రం ‘నోటా’. విజయ్ కెరీర్లో చేసిన వేస్ట్ సినిమాల్లో ఇదొకటని చెప్పొచ్చు. ఈ చిత్రంతో అతను తమిళంలోకి కూడా అడుగు పెట్టాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఎంతమాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాను రూపొందించింది యువ దర్శకుడు ఆనంద్ శంకర్.
‘అరిమా నంబి’ (తెలుగులో డైనమైట్‌గా రీమేక్ అయింది) లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అతను.. ఆ తర్వాత విక్రమ్‌తో ‘ఇరు ముగన్’ (ఇంకొక్కడు)’ అనే డిజాస్టర్ అందించాడు. ఆ తర్వాత ‘నోటా’ సైతం డిజాస్టరే అయింది. దీంతో ఇక అతడికి పేరున్న హీరోలు అవకాశాలు ఇవ్వడం కష్టమే అనుకున్నారంతా. కానీ అతను ఇద్దరు స్టార్లతో క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం చేయడం విశేషం.
ఇంతకుముందు బాలా దర్శకత్వంలో ‘అవన్-ఇవన్’ (వాడు-వీడు) అనే మల్టీస్టారర్ చేసిన విశాల్, ఆర్య.. ఆనంద్ శంకర్ కొత్త చిత్రంలో హీరోలుగా నటించనున్నారట. విశాల్ పాజిటివ్ క్యారెక్టర్ చేయనుండగా.. ఆర్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ‘గద్దలకొండ గణేష్’లో పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన మృణాళిని రవి ఇందులో కథానాయికగా నటించనుందట.
భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత ప్రొడ్యూస్ చేయనున్నాడు. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది. ప్రస్తుతం విశాల్ ‘చక్ర’ను విడుదలకు రెడీ చేస్తున్నాడు. అది జీ-5లో విడుదల కాబోతోంది. దాని తర్వాత మిస్కిన్ మధ్యలో వదిలేసిన ‘తుప్పరివాలన్’ సీక్వెల్‌ను స్వీయ దర్వకత్వంలో పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆనంద్ శంకర్ సినిమా మొదలుపెట్టనున్నాడు. ఆర్య కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బందుల్లో ఉన్నాడు.
This post was last modified on October 14, 2020 4:47 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…