సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పెద్దగా వివాదాల జోలికి వెళ్లే వ్యక్తి కాదు. కానీ కొన్ని రోజుల కిందట తాను ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ ‘హరికథ: సంభవామి యుగే యుగే’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ‘‘వాడెవడో ఎర్రచందనం దొంగ హీరో’’ అంటూ పుష్ప సినిమాను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్ వివాదాస్పదమైంది.
నిజానికి మారిన ట్రెండ్ గురించి వివరిస్తూ తాను నెగెటివ్ షేడ్స్ చేసిన సినిమాల గురించి కూడా ప్రస్తావిస్తూ రాజేంద్ర ప్రసాద్ ఈ కామెంట్ చేశాడు. కానీ ఆయన అల్లు అర్జున్‌ను టార్గెట్ చేశాడంటూ కొందరు దీన్ని వివాదంగా మార్చారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చుకున్నారు. తాను లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం ‘షష్ఠిపూర్తి’కి సంబంధించిన ఈవెంట్లో ఈ విషయంపై ఆయన మాట్లాడారు.
తన వ్యాఖ్యలను వక్రీకరించి వివాదంగా మార్చారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాను హీరోగా నటించిన అప్పుల అప్పారావు, పేకాట పాపారావు, ఏప్రిల్ 1 విడుదల లాంటి సినిమాలను కూడా ప్రస్తావించి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు హీరోలుగా మారడం గురించి తాను చెప్పానని.. అంతే తప్ప ఎవరినీ టార్గెట్ చేయలేదని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. తాను ఇటీవల అల్లు అర్జున్‌ను కలిశానని.. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో నెగెటివ్‌గా ఆర్టికల్స్ రాస్తున్న, పోస్టులు పెడుతున్న వారి గురించి మాట్లాడుకుని నవ్వుకున్నామని ఆయన చెప్పారు.
ఈ సంగతిలా ఉంచితే తనకింకా పద్మ పురస్కారం రాకపోవడం గురించి ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తనకు పద్మశ్రీ అవార్డు ఎందుకు రాలేదో తనకు తెలియదని.. కానీ ఈ విషయమై ఒకసారి రామోజీ రావు అన్న మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని ఆయన చెప్పాను. తనకు పద్మశ్రీ వచ్చిందా అని గతంలో రామోజీ రావు అడిగారని.. లేదని చెబితే, అందుకు ఫీలవ్వాల్సిన అవసరం లేదని, పద్మశ్రీ పురస్కారం కంటే తన ప్రతిభ గొప్పదని ఆయన అన్నారని.. అప్పట్నుంచి ఈ అవార్డుల గురించి పట్టించుకోవడం మానేశానని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
This post was last modified on January 9, 2025 10:08 am
ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక…
పండగ సినిమాల్లో ఖర్చుపరంగా చూసుకుంటే తక్కువ బడ్జెట్ తో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు డిమాండ్ పెంచుకునే స్థాయికి చేరుకుంది.…
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చి జరిగిన తొక్కిసలాటతో చోటుచేసుకున్న విషాదం యావత్ దేశాన్ని…
తలా అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే అజిత్ ఏడాదికి ఒక సినిమా చేయడమే మహా గగనం. అలాంటిది కేవలం మూడు…
జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యలు భారత క్రికెట్లో కీలక చర్చకు కారణమవుతున్నాయి. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బందులు…
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన…