ఏదో అనుకుంటాం కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ తారల మీద చూపించే ప్రభావం కొన్నిసార్లు మాములుగా ఉండదు. పర్సనల్ గా తీసుకుని బాధ పడే దాకా వెళ్తుంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి అనుభవాన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. వెంకటేష్ మాజీ ప్రియురాలిగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14 విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికరమైన కబుర్లు పంచుకుంటోంది. అందులో తన ఆలోచన విధానాన్ని మార్చేసిన ట్రోలింగ్ ఘటన గురించి చెప్పుకొచ్చింది. గత ఏడాది ఆమె విజయ్ గోట్ లో నటించిన సంగతి తెలిసిందే. కానీ అది పేరుకు బదులు రివర్స్ లో ట్రోలింగ్ తెచ్చింది.
గోట్ లో విజయ్ కొడుకు పాత్రని ఏఐ వాడి సృష్టించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. తనకు జోడిగానే మీనాక్షి చౌదరి నటించింది. పెద్డగా ప్రాధాన్యం లేకుండా ఈజీగా విజయ్ చేతిలోనే చచ్చిపోయే పేలవమైన క్యారెక్టర్ ఇచ్చాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ఇది చూసిన కొందరు నెటిజెన్లు తనను అకారణంగా టార్గెట్ చేసి బాధపెట్టారట. ఇది ఏ దశకు చేరుకుందంటే మీనాక్షి చౌదరి ఏకంగా డిప్రెషన్ కు లోనయ్యేంత. ఇలా కుమిలిపోతున్న టైంలో లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ ఒక్కసారిగా జాతకం మార్చేసింది. అందులో దుల్కర్ సల్మాన్ భార్యగా పెర్ఫార్మన్స్ కు స్కోప్ దక్కి సూపర్ హిట్ కొట్టేసింది.
అప్పుడు కానీ మీనాక్షి చౌదరికి రిలీఫ్ దక్కలేదు. ఆ తర్వాత మట్కా, మెకానిక్ రాకీలు ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీ ప్రస్తుతం తన ఆశలన్నీ సంక్రాంతికి వస్తున్నాం మీద ఉన్నాయి. ఎప్పటి నుంచో కలగంటున్న పోలీస్ ఆఫీసర్ పాత్ర దక్కడం పట్ల తన ఆనందం మాములుగా లేదు. ప్రమోషన్లలో ఇదే చెప్పుకుంటూ మురిసిపోతోంది. ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్యగా నటించినప్పటికీ మీనాక్షికి మంచి స్కోప్ దక్కింది. ట్రైలర్ లో కనిపించింది కూడా. నవీన్ పోలిశెట్టితో జట్టు కట్టిన అనగనగా ఒక రాజు మీద చాలా ఆశలు పెట్టుకుంది. సితార బ్యానర్ కావడంతో కంటెంట్, బడ్జెట్ రెండింటిలోనూ కాంప్రోమైజ్ ఉండదు.
This post was last modified on January 8, 2025 4:57 pm
అల్లుడు అదుర్స్ తర్వాత తెలుగులో దర్శనం లేకుండా మాయమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన సమయాన్ని…
ప్రపంచాన్ని వణికించిన వైరస్‌ల గురించి చెప్పుకోగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కోవిడ్-19 (కరోనా వైరస్). అయితే, కరోనా ముందు కూడా…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టులో గట్టి షాకే తగిలింది. ఏసీబీ విచారణకు…
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని, కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడతామని విద్యా శాఖా మంత్రి నారా లోకేశ్ చెప్పిన…
పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఏర్పడే సందిగ్దత, ఆలస్యం మిగిలిన వాటి మీద ప్రభావం చూపించడం చాలాసార్లు చూసిందే.…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సంపూర్ణ భరోసా ఇస్తూ…