ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో జూనియర్ ఎన్టీఆర్, జై లవకుశ ప్రస్తావన ఉద్దేశపూర్వకంగా తేలేదనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. అసలు తారక్ పేరు, ఫోటో కానీ ఉండకూడదని ముందే నిర్వాహకులు అతిథులకు చెప్పినట్టుగా వచ్చిన వార్తలు బలంగా తిరిగాయి.
కొందరు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఎడిటింగ్ లో ఆ ఫుటేజ్ తీసేశారని పబ్లిసిటీ చేయడంతో రకరకాలుగా దీని గురించి మాట్లాడుతున్నారు. ఫైనల్ గా మొన్న నిర్మాత నాగవంశీ, ఇవాళ బాబీ ప్రెస్ మీట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు.
డాకు మహారాజ్ మీడియా మీట్ లో బాబీ ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ మీరు అనుకున్నంత డ్రామా అక్కడ జరగలేదని, స్లయిడ్స్ లో చూపించిన ఫోటోల గురించి మాట్లాడుకున్నాం తప్పించి ఇంకే ఇతర ఉద్దేశం లేదని చెప్పారు.
బ్రేక్ టైంలో నాగవంశీ, బాలకృష్ణ మాట్లాడుకున్నప్పుడు తారక్ టాపిక్ వచ్చిందని, అయితే ఆన్ రికార్డు ఉండవు కాబట్టి మీకు ఆధారం చూపించలేమని అన్నారు. అంతే కాదు బాలకృష్ణకు జై లవకుశ చాలా ఇష్టమని, పలు సందర్భాల్లో తనతో వ్యక్తిగతంగా అన్నారని వివరణ ఇచ్చారు. ఇక్కడిదాకా మబ్బులు తొలగినట్టేనని బాలయ్య అభిమానులు సంతోషపడుతున్నారు.
బాబీ దర్శకత్వం వహించిన సినిమాల పిక్స్ అన్నీ చూపించి ఒక జై లవకుశనే మర్చిపోవడం వల్ల ఇంత తంటా వచ్చింది. కొందరు తారక్ ఫ్యాన్స్ ఏకంగా డాకు మహారాజ్ ని చూడమని ఎక్స్ లో శపధాలు చేయడం దీని వల్ల కలిగిన పరిణామమే. సో ఫైనల్ గా శుభం కార్డు పడిందనే అనుకోవాలి.
జనవరి 12 విడుదల కాబోతున్న డాకు మహారాజ్ సితార బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాల్లో ఒకటి. ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచేయగా వివిధ గెటప్స్ లో బాలయ్య బాడీ లాంగ్వేజ్ ఆసక్తి రేపుతోంది. రెండో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కి ఇది శ్రీకారం చుడుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.
This post was last modified on January 7, 2025 6:44 pm
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…