గత ఏడాది నెట్ ఫ్లిక్స్ లో నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ విడుదల సమయంలో ఆమెకు, నటుడు నిర్మాత ధనుష్ కు ఎంత వివాదం రేగిందో చూశాం. నానుమ్ రౌడీ తాన్ కంటెంట్ వాడుకునే విషయంలో వ్యవహారం కోర్టుకు వెళ్లగా అతన్ని తీవ్రంగా విమర్శిస్తూ నయన్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులు దుమారం రేపాయి.
తన కెరీర్ ప్రారంభం నుంచి పెళ్లి దాకా గంటన్నర వీడియోలో మొత్తం చెప్పాలనుకున్న నయనతార ఆలోచన ఆశించిన అద్భుతాలు చేయలేకపోయినా ధనుష్ వేసిన కేసు వల్ల ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనేది చెన్నై వర్గాల కథనం. ఇక్కడితో అయిపోలేదు.
కొద్దిరోజుల క్రితం చంద్రముఖి నిర్మాతలు తమ ఫుటేజ్ ని డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు గాను 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారనే వార్త మీడియా వర్గాల్లో తెగ చక్కర్లు కొట్టింది. నయన్ కు మరో తలనొప్పి వచ్చిందని ఫ్యాన్స్ ఫీలయ్యారు.
తీరా చూస్తే అదంతా ఉత్తిదేనని తెలిసింది. షూటింగ్ టైంలోనే చంద్రముఖి నిర్మాతలైన శివాజీ ప్రొడక్షన్స్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (నిరభ్యంతర పత్రం) తీసుకున్న నయనతార బృందం వాళ్ళ అనుమతితోనే కొన్ని విజువల్స్ వాడుకుంది. అవే ఫెయిరీ టెయిల్ లో కనిపించాయి. అంతే తప్ప పుకార్లలో చెప్పుకున్నట్టు ఎలాంటి నష్టపరిహారం డిమాండ్ చేయలేదు.
అయినా చంద్రముఖి నిర్మాత సీనియర్ నటుడు ప్రభు. తన తండ్రి పేరు మీద స్థాపించిన బ్యానర్ నుంచి అవసరం లేని వివాదాలు కోరి తెచ్చుకునే ఉద్దేశంలో లేరు. పైగా కొన్ని సెకండ్ల వీడియోల కోసం అంత రాద్ధాంతం ఎందుకు చేస్తారని, అడగ్గానే సర్టిఫికెట్ ఇచ్చిన సందర్భాన్ని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.
ఏదైతేనేం కథ సుఖాంతం అయ్యింది కానీ ధనుష్ తో రచ్చ మాత్రం ఇంకా క్లైమాక్స్ కు వచ్చినట్టు లేదు. ఇన్ని కాంట్రావర్సీలు, డిస్కషన్లు జరిగినా సదరు డాక్యుమెంటరీ మాత్రం ఆన్ లైన్ సెన్సేషన్ కాలేకపోయింది. డ్రామా లేని నటీనటుల ప్రైవేట్ జీవితాల మీద ప్రేక్షకుల ఆసక్తి తక్కువగానే ఉంటుంది.
This post was last modified on January 7, 2025 1:25 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…