Movie News

డబ్బింగ్ హడావిడి లేని మరో సంక్రాంతి

ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమే. మనకే థియేటర్లు సరిపోవయ్యా అంటే హక్కులు కొనేశామనే కారణంతో ఏదోలా రిలీజ్ చేసే నిర్మాతలు కనిపిస్తూనే ఉంటారు.

అయితే గత ఏడాది, ఇప్పుడీ 2025 ఈ ట్రెండుకు బ్రేక్ వేశాయి. 2024 జనవరిలో గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగా, సైంధవ్ తలపడటంతో వేరేవాటికి ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో అదే టైంలో వద్దామనుకున్న అనువాదాలు కెప్టెన్ మిల్లర్, అయలాన్ వాయిదా వేసుకున్నాయి. వాటిలో ఒకటి నెలాఖరుకు వచ్చింది.

ఇప్పుడదే సీన్ రిపీట్ అవుతోంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం తక్కువ గ్యాప్ లో ఎలాంటి బాదరబందీ లేకుండా ప్రశాంతంగా బరిలో దిగుతున్నాయి. మూడు సినిమాలే కాబట్టి సరిపడా స్క్రీన్లు సర్దటంలో డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు.

దిల్ రాజు అందుకే కూల్ గా కనిపిస్తున్నారు. కానీ గతంలో ఇలాంటి సీన్ లేదు. 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, కళ్యాణం కమనీయం లాంటి స్ట్రెయిట్ మూవీస్ ఉన్నా విజయ్ వారసుడు, అజిత్ తెగింపులు ఇక్కడ స్పేస్ దక్కించుకున్నాయి. ఫలితాల సంగతి పక్కనపెడితే పరస్పరం వసూళ్లు ప్రభావితం చెందాయి.

అంతకు ముందు 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్2లు ఉన్నా పేటకు థియేటర్ల తక్కువయ్యాయని నిర్మాత ప్రెస్ మీట్ పెట్టడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. రజనీకాంత్ బొమ్మ కాబట్టి ఏదోలా సర్దుబాటు జరిగింది.

ఈసారి అలాంటి గోల లేకుండా దిగుతున్నారు కనక రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ ఈ అవకాశాన్ని ఫుల్లుగా వాడుకోవాలి. టాక్ పాజిటివ్ వస్తే చాలు కనీసం రెండు వారాల పాటు థియేటర్లు జనాలతో కళకళలాడతాయి. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ప్రీ రిలీజ్ బజ్ ఇంచుమిందు అన్నింటికి ఒకేలా కనిపిస్తున్న తరుణంలో ఎవరిది పైచేయి అవుతుందో.

This post was last modified on January 6, 2025 5:55 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago