Movie News

ట్రైలరుతోనే ట్రోల్ అయిపోయిన రవికుమార్…

కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా మాస్ కోసమని పాత ఫార్ములాను వాడి హిట్లు కొట్టే దర్శకులు ఎందరో. అది జనానికి నచ్చేలా ఉంటుందో లేదో ట్రైలర్ రూపంలో శాంపిల్ వదులుతారు.

కానీ బాలీవుడ్ నుంచి వచ్చే నెల రాబోతున్న బ్యాడ్ ఆస్ రవికుమార్ అనే కళాఖండం మాత్రం వెరైటీ స్ట్రాటజీని అనుసరిస్తోంది. 80 దశకం నాటి కథా కథనాలతో ఈ సినిమా తీశామని ఓపెన్ గా చెబుతూ దాన్నే ప్రమోషన్లలో వాడుకుంటున్నారు. ఒకప్పటి టాప్ సింగర్ హిమేష్ రేషమియా ఇందులో హీరోగా నటించడంతో పాటు సంగీతం అందించారు.

ట్రైలర్ లోనే బోలెడు ట్రోలింగ్ స్టఫ్ కనిపిస్తోంది. రంపపు మెషీన్ పట్టుకుని ఎదురొచ్చిన రౌడీ శరీరాన్ని ముక్కలు చేయడం దగ్గరి నుంచి నమ్మకశ్యం కానీ ఎన్నో షాట్లు, జంపులు, ఛేజులు ఇందులో పొందుపరిచారు. విచిత్రం ఏంటంటే ఖరీదైన లొకేషన్లు, విదేశాల్లో పాటలు ఫైట్లు ఇలా భారీతనం ఏ మాత్రం తగ్గకుంగా గ్రాండియర్ గా తీశారు.

మరో ట్విస్టు ఏంటంటే మన ప్రభుదేవా ఇందులో విలన్. పదే పదే 80 స్టైల్ అని క్యాప్షన్లు పెట్టి మరీ పబ్లిసిటీ చేస్తున్న ఈ బ్యాడ్ ఆస్ రవికుమార్ కు ఒక్క రోజులోనే 30 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. సోషల్ మీడియాలో నెటిజెన్లు దీన్ని ట్రోల్ చేస్తూనే మరోవైపు ఎంజాయ్ చేస్తున్నారు.

అసలు కంటెంట్ ఎలా ఉందనేది పక్కనపెడితే హిమేష్ ఫ్యాన్స్ కొందరు విక్రమ్, మార్కో, ఖైదీ, యానిమల్ తో దీన్ని పోలుస్తూ పోస్టులు పెట్టడం మాములు కామెడీ కాదు. అసలు పేపర్ మీదే ఇంత రొటీనా అనిపించే కథని ఇన్నేసి కోట్లను కుమ్మరించిన నిర్మాతల ధైర్యాన్నిమెచ్చుకోవలసిందే.

ఏదైనా పన్ను మినహాయింపు కోసం తీశారేమోననే అనుమానాలు లేకపోలేదు. హిందీ విశ్లేషకులు, రివ్యూయర్లు మాత్రం హిమేష్ ప్రయత్నం ఎలా ఉన్నా బిసి సెంటర్లలో వసూళ్లు ఖాయంగా వస్తాయని చెబుతున్నారు. పుష్ప 2 లాంటి ఆర్గానిక్ మాస్ చూసిన కళ్ళు బ్యాడ్ ఆస్ రవికుమార్ ని ఒప్పుకుంటాయా.

This post was last modified on January 6, 2025 4:26 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

3 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

4 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

5 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago