తెలంగాణలో ఇకపై టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టాలీవుడ్ సినీ ప్రముఖులతో భేటీ అయిన సందర్భంగా కూడా ఈ ప్రస్తావన వారి మధ్య వచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ ఒక్క విషయంలో మాత్రం రేవంత్ వెనక్కు తగ్గలేదని ప్రచారం జరిగింది.
అయితే, టికెట్ రేట్ల పెంపు అంశంపై చర్చించలేదని టీఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆనాడు అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా టికెట్ రేట్ల పెంపుపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అడగనిదే అమ్మైనా పెట్టదని, తెలంగాణలో గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని దిల్ రాజు చెప్పారు.
జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లకు దిల్ రాజు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని మరోసారి రిక్వెస్ట్ చేస్తానని దిల్ రాజు చెప్పారు.
టికెట్ రేట్లు పెంచితే 18 పర్సెంట్ గవర్నమెంట్ కు వెళుతుందని, భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వాల సహాయం అవసరమని చెప్పారు. భారీ స్థాయిలో రూపొందుతున్నందునే తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి దక్కిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి అన్నీ ఇస్తానని చాలాసార్లు చెప్పారని, ఆ ఆశతో మళ్లీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి టికెట్ రేట్లు, స్పెషల్ షోల గురించి మాట్లాడతానని అన్నారు. దిల్ రాజు రిక్వెస్ట్ ను రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on January 6, 2025 3:27 pm
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…
వైసీపీ అధినేత జగన్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయనను అరెస్టు చేయొచ్చా.? అది తప్పితే.. ఆయన…
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…