విజయ్ సేతుపతి మహారాజ గత ఏడాది ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. తెలుగులో అంచనాలు లేకుండా రిలీజై ఇక్కడా సూపర్ హిట్ అందుకుంది. సరే ఇండియాలో హిట్ కావడం పెద్ద విశేషం కాదు కానీ అసలు మన భాషలే తెలియని చైనాలో మహారాజా బ్లాక్ బస్టర్ కావడం మాములు విషయం కాదు.
ఆ దేశంలో ఇప్పటిదాకా టాప్ గ్రాసర్స్ గా ఉన్న సినిమాలన్నీ బాలీవుడ్ నుంచి వచ్చినవే. అమీర్ ఖాన్ దంగల్ 1480 కోట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా అదే హీరో సీక్రెట్ సూపర్ స్టార్ 840 కోట్లతో రెండో ప్లేస్ లో ఉంది. మూడో స్థానం అందాదున్ తీసుకుంది. దాని లెక్క 368 కోట్లు.
అక్కడి నుంచి వరసగా భజరంగి భాయ్ జాన్ (323 కోట్లు), హిందీ మీడియం (238 కోట్లు), హిచ్కీ (170 కోట్లు), పీకే (134 కోట్లు), మామ్ (130 కోట్లు), టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ (108 కోట్లు) తో ఉన్నాయి. ఇప్పుడు మహారాజా 92 కోట్లతో పదో ర్యాంక్ లో ఉంది. చైనాలో టాప్ 10 ఇండియన్ సినిమాల్లో దక్షణాదిది మహారాజ ఒక్కటే.
ఇంకా ఫైనల్ రన్ పూర్తవ్వలేదు కాబట్టి 100 కోట్ల రికార్డు బ్రేక్ చేస్తుందేమో చూడాలి. రాజమౌళి బాహుబలి 2 కేవలం 80 కోట్లతో ఉండగా బాహుబలి 50 కోట్లతో సరిపెట్టుకుంది. ఆర్ఆర్ఆర్ 40 కోట్ల దగ్గర రాజీ పడింది. ఈ లెక్కన మహారాజ ప్రభావం ఏ స్థాయిలో చైనా ప్రేక్షకుల మీద ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్వంత కూతురు కాకపోయినా ఒక అమ్మాయి అఘాయిత్యానికి బలైతే పెంచుకున్న తండ్రి తీర్చుకునే ప్రతీకారం చైనా జనాలకు ఓ రేంజ్ లో కనెక్ట్ అయిపోయింది. సీరియస్ టోన్ లో సాగుతూ ఎక్కడా కమర్షియల్ అంశాలకు చోటు లేకుండా తీసిన విధానం విమర్శకులను సైతం మెప్పించింది.
చైనాలో టాప్ 10 ఇండియన్ మూవీస్ గమనిస్తే మాస్ మసాలా సినిమా ఏదీ ఉండదు. అన్నీ కంటెంట్ ఆధారంగా తీసినవే ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన మన చిత్రాలను వాళ్లంత సీరియస్ గా తీసుకోరు. భావోద్వేగాలు బలంగా ఉంటే చాలు చైనాలో దుమ్ము దులిపేయొచ్చు. కలెక్షన్లు అదే స్పష్టం చేస్తున్నాయి.
This post was last modified on January 6, 2025 12:23 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా వెలుగు చూసిన హెచ్ ఎంపీవీ వైరస్ విషయంలో వ్యక్తిగత జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇచ్చారు.…
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులు బెంగళూరుకు క్యూ కడుతున్నార ని.. భవిష్యత్తులో కుప్పానికి…
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…