ప్రస్తుతం పెద్ద సినిమాల్లో ప్రత్యేక అతిథి పాత్రలను క్రియేట్ చేసి పేరున్న నటులతో వాటిని చేయించడం ట్రెండుగా మారింది. ఈ కోవలోనే ‘డాకు మహారాజ్’లో దుల్కర్ సల్మాన్‌తో ప్రత్యేక ప్రాత్ర చేయిస్తున్నట్లు ఈ సినిమా మేకింగ్ ఆరంభ దశలో వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఏమైందో తెలియదు. దుల్కర్ ఈ మూవీలో భాగం కాలేదు. సినిమాలో ఇంకెవరైనా ఈ పాత్రను చేశారా అని చూస్తే.. ట్రైలర్లో అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు.
ఇదే విషయమై దర్శకుడు బాబీని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. దుల్కర్ క్యామియో వెనుక రహస్యాన్ని వెల్లడించాడు. ముందు ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రను అనుకున్నామని.. దాన్ని దుల్కర్‌తో చేయించాలని చూసిన మాట వాస్తవమే అని బాబీ తెలిపాడు. అప్పటికి దుల్కర్ కూడా ఈ పాత్ర చేయడానికి సుముఖంగానే ఉన్నాడని అతనన్నాడు.
ఐతే ఆ పాత్రను డెవలప్ చేసే క్రమంలో కథకు ఆ క్యారెక్టర్ అవసరం లేదని అనిపించిందని బాబీ చెప్పాడు. అందుకే ఆ పాత్రను కథ నుంచి తీసేశామని.. దీంతో దుల్కర్ తమ సినిమాలో నటించలేకపోయాడని బాబీ తెలిపాడు. ‘డాకు మహారాజ్’ను నిర్మించిన సితార సంస్థలోనే దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ లాంటి స్పెషల్ మూవీ చేశాడు.
రెండూ ఒకేసారి చిత్రీకరణ జరుపుకున్నాయి. కాబట్టి నిర్మాత నాగవంశీ అడిగితే దుల్కర్ నో చెప్పకుండా ‘డాకు మహారాజ్’లో నటించేవాడే. కానీ దర్శక నిర్మాతలకే ఆ పాత్ర అవసరం లేదనిపించి పక్కన పెట్టినట్లున్నారు. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య ‘డాకు మహారాజ్’ రిలీజవుతోంది.
లేటెస్ట్‌గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ మాస్‌నే కాక మిగతా ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షిస్తోంది. సంక్రాంతికి మాస్ ట్రీట్ ఖాయమనే సంకేతాలు ఇచ్చింది ట్రైలర్. జనవరి 14న, ఆదివారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
This post was last modified on January 5, 2025 5:15 pm
ఏకంగా 7500 కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఖర్చు చేశారు. మరో వారం రోజుల్లో మహా క్రతువ ను…
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…