నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు రోజుల్లో ఆక్యుపెన్సీలు తగ్గిపోయాయి. సంక్రాంతికి కొత్త రిలీజులు వచ్చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ పికప్ ఆశించలేం కానీ అదనంగా మరో 15 నుంచి 18 నిమిషాల ఎడిటింగ్ లో తీసేసిన ఫుటేజ్ జోడించబోతున్నారనే ప్రచారం వారం క్రితమే వచ్చింది.
అయితే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో అభిమానులు అయోమయంలో ఉన్నారు. ఎప్పటి నుంచి జోడిస్తారో తెలిస్తే మళ్ళీ షో ప్లాన్ చేసుకోవాలనేది వాళ్ళ కోరిక. అసలు కథేంటో చూద్దాం.
నిజంగానే ఎక్స్‌ట్రా కంటెంట్ సిద్ధం చేశారు కానీ అది థియేటర్లకా లేక ఓటిటి వెర్షన్ కు జోడించాలా అనే దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ప్రస్తుతానికి దర్శకుడు సుకుమార్ దీని పని మీదే ఎడిటింగ్ రూమ్ లో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు సమాచారం.
ఇంత బ్లాక్ బస్టర్ సాధించాక ఎలాంటి కామెంట్స్ రావడానికి అవకాశం లేకుండా పర్ఫెక్ట్ గా కట్ చేయిస్తున్నారని వినికిడి. బన్నీ ప్రత్యేకంగా డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు. పండగ హడావిడికి కేవలం ఆరు రోజులే ఉన్న నేపథ్యంలో ఇప్పుడీ కొత్త ప్రయోగం ఎంత మేరకు ఫలితం ఇస్తుందనేది ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారట.
మన దగ్గర ఏమో కానీ పుష్ప 2ని విపరీతంగా ప్రేమించిన హిందీ ప్రేక్షకులు మాత్రం ఎక్స్‌ట్రా కంటెంట్ ని ఎంజాయ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వీర ఫ్యాన్స్ ఆల్రెడీ అయిదారు రిపీట్లు వేశారు. మళ్ళీ చూస్తారా అనేది అనుమానమే.
ఒకపక్క మార్కో బాగానే ఆడుతోంది. ఇంకోవైపు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చూసేందుకు మూవీ లవర్స్ పర్సులు రెడీ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో పుష్ప 2 మళ్ళీ వర్కౌట్ అయితే మరో సంచలనమే. ఇన్ సైడ్ టాక్ అయితే ఓటిటి కోసమనే ఉంది. లేదూ థియేటర్ అంటే మాత్రం మరోసారి సెలబ్రేషన్స్ కి బన్నీ ఫ్యాన్స్ సిద్ధమే.
This post was last modified on January 4, 2025 9:45 pm
https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…
ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…
రాష్ట్రానికి సంబంధించి విజన్-2047 ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు.. తాజాగా తన సొంత నియోజక వర్గం.. 35 ఏళ్ల నుంచి వరుస…
ఏపీలో కూటమి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత,…
గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…