జనవరి 14 విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లకు సంబంధించిన ఏ అవకాశాన్ని వెంకటేష్, అనిల్ రావిపూడి వదలడం లేదు. ఇప్పటికే వెరైటీ పబ్లిసిటీతో సోషల్ మీడియాలో టాపిక్ గా మారిపోయిన ఈ టీమ్ ఇంకోవైపు భీమ్స్ ఇచ్చిన మూడు ఛార్ట్ బస్టర్ సాంగ్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ఛాయస్ ని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ సాధించింది.
చివరిగా వస్తోందన్న మాటే కానీ ఓపెనింగ్స్ బలంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వెంకీ పాత గెటప్పులుతో అనిల్, ఐశ్వర్య, మీనాక్షి, దిల్ రాజు చేసిన ఇంటర్వ్యూ తొలుత ట్రోలింగ్ అయినా తర్వాత ఇదీ సూపర్ హిట్ అనిపించుకుంది.
ఇక తాజాగా వెంకటేష్ అభిమానులతో ఫోటో షూట్ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్ తో గంటల తరబడి ఓపిగ్గా నిలబడి వాళ్ళ ముచ్చట తీర్చారు. మూడు వేలకు పైగా వచ్చి ఉంటారని అంచనా. రేపు కూడా కొనసాగించవచ్చని సమాచారం.
గత నెలే రామ్ చరణ్ ఇది చేసినప్పటికీ ఇంత కౌంట్ లేదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో పరిమిత సంఖ్యలో ఫ్యాన్స్ ని పిలవడంతో సైలెంట్ గా అయిపోయింది. టైం తక్కువగా ఉంది కాబట్టి మరోసారి చేసే అవకాశం లేనట్టే. ఇక బాలకృష్ణ ప్రత్యేకంగా వీటికి టైం కేటయించడం ఉండదు కాబట్టి డాకు మహారాజ్ కు నో ఛాన్స్. ఇక్కడే వెంకీ మామకు ఎడ్జ్ కలిసి వస్తోంది.
ఎల్లుండి జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ వచ్చేస్తుంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ పోటీని తట్టుకుంటుందా అనే అనుమానం నుంచి ఇప్పుడీ లెవెల్ కు బజ్ పెంచుకోవడంలో మొదటి క్రెడిట్ వెంకటేష్ ఆ తర్వాత అనిల్ రావిపూడికే దక్కుతుంది. రెండు బ్యాలన్స్ చేయాల్సిన ఒత్తిడిలో దిల్ రాజు ఉండగా ఆ ప్రెజర్ ని వీళ్లిద్దరూ తగ్గించేశారు.
దానికి తోడు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి రెండు వారాల డేట్లు ప్రమోషన్లకు ఇవ్వడం మరింత ప్లస్ అవుతోంది. పండక్కు వచ్చే మూడు సినిమాలు దేనికవే ప్రత్యేకంగా అనిపిస్తున్నా సంథింగ్ స్పెషలనే రేంజులో వెంకీ మామ ఆకట్టుకోవడం వాస్తవం.
This post was last modified on January 4, 2025 2:49 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…