కొన్నిసార్లు సినిమాల పరంగా జరిగే సంఘటనలు యాదృచ్చికమే అయినా విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ లో అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన భార్యగా అంజలి నటించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లో చూపించిన కట్స్ ప్రకారం రామ్ చరణ్ తల్లిగా కూడా సెకండాఫ్ లో కనిపించబోతోంది. పెర్ఫార్మన్స్ కి చాలా స్కోప్ ఉన్నట్టు, క్లైమాక్స్ కు ముందు తన నటన అద్భుతమనిపించేలా ఉంటుందని దర్శకుడు శంకర్ కితాబు ఇవ్వడం చూశాం. హీరోయిన్ గా స్టార్ల సరసన ఆఫర్లు తగ్గిపోయిన టైంలో అంజలికిది మాములు ఛాన్స్ కాదు.
ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో కన్నా అసలు విశేషం వేరే ఉంది. అంజలి ఎప్పుడో 2012లో నటించిన మదగజరాజ జనవరి 12 రిలీజవుతోంది. ఇందులో విశాల్ హీరో. పదమూడు సంవత్సరాల క్రితం కాబట్టి అందులో అంజలి గ్లామర్ టచ్ ఉన్న హీరోయిన్ గా నటించింది. తనతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ ఉంది. ఇంత లేట్ అయినా సరే పొంగల్ బరిలో దిగటంతో ఒక్కసారిగా ఫ్యాన్స్, కోలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఎప్పటికి రాదనుకున్న చిత్రం హఠాత్తుగా రిలీజ్ డేట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ కు దారి తీసింది. ఇందులో విశాల్ స్వయంగా పాడిన పాట ఉండటం గమనార్హం.
ఒకపక్క మెచ్యూర్డ్ గా ఒక సినిమా, ఇంకోవైపు ఆడిపాడే మసాలా మూవీ ఇలా క్లాష్ కావడం అంజలికే జరిగింది. మదగజరాజ తెలుగులో వచ్చేది అనుమానంగానే ఉంది. తమిళంలో మాత్రం గేమ్ ఛేంజర్ తో పాటు మరో ఏడెనిమిది సినిమాలతో తలపడనుంది. గత ఏడాది గీతాంజలి మళ్ళీ వచ్చిందితో హిట్టు కొట్టాలని చూసిన అంజలికి ఆశ నెరవేరలేదు. ఒకవేళ గేమ్ ఛేంజర్ సక్సెస్ అయితే మాత్రం మరో బ్రేక్ దొరుకుతుంది. ఆ మధ్య గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో కొంచెం బోల్డ్ క్యారెక్టర్ చేసిన ఆశించిన ఫలితం దక్కలేదు. మరి సంక్రాంతికి దక్కుతున్న డబుల్ బొనాంజాతో ఏమైనా జాక్ పాట్ కొడుతుందేమో చూడాలి.
This post was last modified on January 3, 2025 5:46 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను…
ప్రస్తుతం పెద్ద సినిమాల్లో ప్రత్యేక అతిథి పాత్రలను క్రియేట్ చేసి పేరున్న నటులతో వాటిని చేయించడం ట్రెండుగా మారింది. ఈ…
తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. కొన్నాళ్ల పాటు మందగించినా.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మాదాపూర్లోని…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాక బెనిఫిట్ షోలకు ఈజీగా అనుమతులు రావడం మొదలైంది. రెండు చోట్లా అర్ధరాత్రి నుంచే…
ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్ ప్లాట్ఫారంగా గుర్తింపు పొందిన ఓయో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మేజర్ వయసు ఉన్నవారెవరైనా…
గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటిదాకా నాలుగు పాటలు రిలీజైనా అభిమానులు హ్యాపీనే కానీ ఇంకేదో మిస్సయ్యిందనే ఫీలింగ్ వాళ్లలో కొంత…