Movie News

బాలీవుడ్ ఎటాక్.. దర్శకుడికి రివర్స్ ఎటాక్

బాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ గురించి కొన్ని రోజులుగా ఎంత పెద్ద చర్చ నడుస్తోందో తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ మొత్తం డ్రగ్స్‌లో మునిగిపోయిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. దీని మీద మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

ఐతే కొన్నాళ్ల పాటు ఈ వ్యవహారాన్ని మౌనంగా చూస్తూ ఉన్న బాలీవుడ్ పెద్దలు.. ఇటీవల మౌనం వీడారు. తమ ప్రతిష్ఠను దెబ్బ తీస్తోందన్న ఉద్దేశంతో రిపబ్లిక్ టీవీ మీద నాలుగు పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల అధినేతలతో పాటు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లు సైతం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనికి బాలీవుడ్ నుంచి బలమైన మద్దతే లభించింది. రిపబ్లిక్ టీవీని టార్గెట్ చేస్తూ, పిటిషన్ వేసిన బాలీవుడ్ బడా బాబులకు మద్దతుగా చాలామంది ఇండస్ట్రీ జనాలు పోస్టులు పెట్టారు.

ఐతే ముందు నుంచి ఈ బాలీవుడ్ పెద్దల మీద పోరాడుతున్న కంగనా రనౌట్ మాత్రం వీళ్లిలా పిటిషన్ వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. వాళ్లందరూ తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శలు గుప్పించింది. ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రముఖుడు కంగనా బాటలో నడిచాడు. సొంత ఇండస్ట్రీ మీద విమర్శలు గుప్పించాడు. అతనే ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.

తమ గురించి రిపబ్లిక్ టీవీ వాడిన అభ్యంతరకర పదాలను ఉటంకిస్తూ పిటిషన్ వేయడాన్ని ప్రస్తావిస్తూ.. వివేక్ ఇండస్ట్రీ జనాలకు కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఒక హిందీ సినిమాలో వేశ్య పాత్రకు ‘సావిత్రి’ అని పేరు పెట్టారని.. అది అభ్యంతరకరం కాదా అని ప్రశ్నించాడు. సంగీతం, భాష, సంస్కృతి, కళ.. ఇలాంటి వాటిని నాశనం చేస్తున్నందుకు బాలీవుడ్ మీద జనాలు కూడా దావా వేయొచ్చా అని అతను ప్రశ్నించాడు. కంగనా తరహాలోనే వివేక్ సైతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుదారన్న పేరుంది. లిబరల్స్‌గా ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నించే బాలీవుడ్ ప్రముఖుల మీద అతను ఈ మధ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు.

This post was last modified on October 13, 2020 2:54 pm

Share

Recent Posts

మూడు సర్‌ప్రైజులు ఇవ్వనున్న కాకా ?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…

59 minutes ago

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

2 hours ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

3 hours ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

3 hours ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

4 hours ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

4 hours ago