Movie News

టాక్ ఆఫ్ ద టౌన్.. రాజమౌళి సంస్కారం

ఇప్పుడు ఇండియన్ సినిమాలో తెలుగు చిత్రాలదే హవా. మొత్తంగా సక్సెస్ రేట్ గొప్పగా లేకపోయినా.. మన దగ్గర్నుంచి వస్తున్న కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఒరవడికి శ్రీకారం చుట్టిన దర్శకుడు రాజమౌళి. ‘బాహుబలి’తో ఆయన మొత్తం కథను మార్చేశారు. ఆ సినిమాతో ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా అవతరించారు.

ఆయన తర్వాతి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ లెజెండరీ ఫిలిం మేకర్లు కూడా నోరెళ్లబెట్టేలా చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ఊహించని స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రానికి రెండు ఆస్కార్ అవార్డులు కూడా రావడం తెలిసిందే. దీంతో రాజమౌళిని, తెలుగు సినిమాను చూసి ఇతరులు అసూయ చెందే పరిస్థితి వచ్చింది. ఆ అసూయతోనే రాజమౌళి మీద తమిళ జనాలు విద్వేషాన్ని వెళ్లగక్కుతుంటారు సోషల్ మీడియాలో. అదే సమయంలో రాజమౌళి ఎదుగుదలను చూపించి మన వాళ్లు అతి చేయడమూ కనిపిస్తుంటుంది. ఇప్పుడు సరైన ఫాంలో లేని లెజెండరీ డైరెక్టర్ శంకర్‌ను తక్కువ చేసే మాట్లాడ్డం ఇందులో భాగమే. ‘ఇండియన్-2’ రిలీజ్ టైంలో శంకర్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు.

ఐతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం.. మూలాలను, గతాన్ని మరిచిపోకపోవడమే ఒక వ్యక్తి గొప్పదనాన్ని చాటుతుందని రాజమౌళి రుజువు చేశాడు. ఇప్పుడు తాను ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నానని ఆయనేమీ పొంగిపోవడం లేదు. ఒకప్పుడు శంకర్ ఎంత గొప్ప సినిమాలు తీశాడో ఆయన మరిచిపోలేదు. శంకర్ తన లాంటి వర్ధమాన దర్శకులకు ఎంత స్ఫూర్తినిచ్చాడో గుర్తు చేసుకుని తన సంస్కారాన్ని చాటాడు. ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శంకర్ గురించి రాజమౌళి అన్న మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమిళులు ఈ వీడియోను బాగా వైరల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి గొప్పదనాన్ని వాళ్లు గుర్తిస్తున్నారు. అలాగే శంకర్‌ను తక్కువ చేసి మాట్లాడేవాళ్లు కూడా ఈ వీడియో చూడాల్సిందే.

గత పదేళ్లుగా భారీ చిత్రాలు తీస్తున్న తమలాంటి దర్శకులను చూసి ఈ తరం దర్శకులు గర్వ పడుతున్నారని.. కానీ తాము అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నపుడు భారీ సినిమాలు తీసి తమకు స్ఫూర్తినిచ్చింది శంకరే అని రాజమౌళి వ్యాఖ్యానించాడు. ఆయనే అసలైన ఓజీ అంటూ రాజమౌళి కొనియాడారు. మనకున్న పెద్ద కలల్ని తెరపై ఆవిష్కరించే విషయంలో భయపడాల్సిన అవసరం లేదని, అలా తీస్తే ప్రేక్షకులు బాగా చూస్తారు, డబ్బులు కూడా వెనక్కి వస్తాయని రుజువు చేసింది శంకరే అని.. అందుకే ఆయనంటే తమకు అభిమానమే కాదు, గౌరవం అని రాజమౌళి వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఎవ్వరూ అందుకోలేని స్థాయిలో ఉన్నప్పటికీ.. శంకర్ గురించి ఇంత గొప్పగా మాట్లాడ్డం రాజమౌళి గొప్ప సంస్కారాన్ని తెలియజేస్తుంది. ఇది చూసి ఇటు రాజమౌళిని విమర్శించేవాళ్లు, అటు శంకర్‌ను తక్కువ చేసే వాళ్లు నోటికి తాళాలు వేసుకుంటే మంచిది.

This post was last modified on January 3, 2025 7:15 pm

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

1 hour ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

2 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

2 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

3 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

4 hours ago