సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే బాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది. తన తొలి హిందీ చిత్రం ‘బేబీ జాన్’ క్రిస్మస్ కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్డ్ రివ్యూలతో మొదలైన ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది.
ఐతే ఫలితం ఎలా ఉన్నా.. సినిమాలో కీర్తి పెర్ఫామెన్స్, గ్లామర్ బాగానే హైలైట్ అయింది. ఈ చిత్రం కోసం ప్రమోషన్ల పరంగా కీర్తి చాలానే కష్టపడింది. పలు ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంది. ఆ సందర్భంగా బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని లుక్స్‌లో కనిపించింది. కీర్తి ఎక్కడికి వెళ్లినా తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లు ఆమె మీద బాగా ఫోకస్ చేశారు. ఐతే ఒక ఈవెంట్ సందర్భంగా బ్యాడ్ యాంగిల్లో తన ఫొటోలు, వీడియోలు తీయడం కీర్తికి రుచించలేదు.
కీర్తి కార్లోకి ఎక్కుతుండగా.. అవతలి వైపు నుంచి ఒక ఫొటోగ్రాఫర్ ఫొటో తీస్తుంటే.. కీర్తి అసిస్టెంట్ వారించారు. దీని మీద చిన్న గొడవ నడిచింది. ఈ గొడవపై కీర్తి తాజాగా స్పందించింది. ఆ గొడవ టైంలో అసలేం జరుగుతోందో తనకు అర్థం కాలేదని చెప్పింది. తర్వాత తన అసిస్టెంట్ ఏం జరిగిందో వివరించిందని వెల్లడించింది. తాను అప్పటికే ఫొటోగ్రాఫర్లకు కావాల్సినన్ని పోజులు ఇచ్చానని.. కానీ కార్లోకి ఎక్కుతూ బెండ్ అయిన సమయంలో తనను అవతలి నుంచి ఫొటో తీయాలని చూశారని.. అది బ్యాడ్ యాంగిల్ కదా అని కీర్తి పేర్కొంది. ఇలా ఫొటోలు తీయడం తప్పని ఆమె వ్యాఖ్యానించింది.
ఓపిగ్గా ఫొటోలకు పోజులు ఇచ్చాక ఇలా చేయాల్సిన అవసరం లేదని ఆమె తెలిపింది. అంతకుముందు కీర్తి రెడ్ టాప్‌లో ఒక ఈవెంట్‌కు హాజరు కాగా.. ఆమె జీప్ నుంచి కిందికి దిగే క్రమంలో వంగినపుడు బ్యాడ్ యాంగిల్లో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అవి వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి లేటెస్ట్ ఫొటోల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండొచ్చు.
This post was last modified on January 3, 2025 3:39 pm
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి దర్శకుడికీ ఆశ ఉంటుంది. కానీ ఆ కల…
రాష్ట్ర విభజనతో అసలే అప్పులతో ప్రస్థానం మొదలుపెట్టిన నవ్యాంధ్రను గత వైసీపీ ప్రభుత్వం మరింత అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…