బాలకృష్ణ – బాబీ కాంబోలో రూపొందిన డాకు మహారాజ్ మీద అభిమానుల ఆశలు ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తున్నాం. తమన్ పాటలు అఖండ రేంజులో వెళ్లడం లేదనే అసంతృప్తి ఫ్యాన్స్ లో కనిపిస్తోంది కానీ నిన్న వచ్చిన దబిడి దిబిడి సాంగ్ మీద సోషల్ మీడియాలో ఫీడ్ బ్యాక్ సర్వత్రా చర్చగా మారింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మీద నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలయ్య ఇమేజ్, స్థాయిని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఐటెం సాంగ్ కోణంలో కంపోజ్ చేశారని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. సరే సినిమా అన్నాక అన్ని రకాల స్పందనలు స్వీకరించాలి కాబట్టి కాసేపది పక్కన పెడదాం.
నిజానికి ఇది టెన్షన్ పడే మ్యాటర్ కాదని చెప్పడానికి కారణముంది. డాకు మహారాజ్ ట్రైలర్ ఇంకా రాలేదు. పలు సందర్భాల్లో నిర్మాత నాగవంశీ పదే పదే ఎప్పుడు చూడని పవర్ ఫుల్ యాక్షన్ లో బాలయ్యని చూస్తారని పదే పదే ఊరించడం తెలిసిందే. దానికి తగ్గ విజువల్స్ రేపు అమెరికాలో జరగబోయే ట్రైలర్ లాంచ్ లో రివీలవుతాయి. ఒక్కసారి అవి బయటికి వచ్చాక ఏదైనా నెగటివిటీ ఉంటే మొత్తం మాయమైపోతుందని సితార వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. జైలర్, విక్రమ్ రెఫరెన్సులు ఊరికే చెప్పలేదని, వాటిని మించిన కంటెంట్ ని బాబీ ఇస్తున్నారని నమ్మకంగా అంటున్నారు.
సో ఇప్పుడు వెయిట్ చేయాల్సింది ట్రైలర్ గురించే తప్ప దబిడి దిబిడి గురించి కాదనేది టీమ్ నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. రూలర్ టైంలోనూ ఇలాంటి పరిస్థితిని బాలయ్య ఫేస్ చేశారు. తర్వాత అఖండ నుంచి ఎవరికి నోరు పారేసుకునే ఛాన్స్ ఇవ్వలేదని సీనియర్లు కౌంటర్లు ఇస్తున్నారు. గేమ్ ఛేంజర్ సైతం బజ్ తక్కువగా ఉన్న పరిస్థితి నుంచి ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా పాజిటివ్ వైబ్ తెచ్చేసుకుంది. డాకుకు అంతకు మించే రెస్పాన్స్ ఉంటుందనేది ఇన్ సైడ్ టాక్. అసలు కంటెంట్ చాలా దాచి పైపై కోటింగ్ తో నెట్టుకొస్తున్న బాబీ బృందం థియేటర్లలో మాత్రం బ్లాస్ట్ అయ్యే షాకులు ఇస్తుందట. చూద్దాం.
This post was last modified on January 3, 2025 3:07 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…