ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ప్లేస్ ఏంటో చెప్పనక్కర్లేదు. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టినా పుష్ప 2లో కిస్ కిస్ కిసిక్ అనిపించినా డాన్సులతో వాటిని స్థాయిని అమాంతం పైకి తీసుకెళ్లిన ఘనత తనకే దక్కుతుంది. గత ఏడాది గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీ అయిపోతున్న శ్రీలీల త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకోబోతోందని ముంబై టాక్. కార్తీక్ ఆర్యన్ హీరోగా సమీర్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించబోయే తు మేరీ మై తేరి మై తేరా తు మేరాలో హీరోయిన్ అవకాశం ఈ అమ్మడికే దక్కబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం చర్చల దశలో ఉందట.
నిజానికి శ్రీలీలకు ముందు ప్రతిపాదన వచ్చింది ఇది కాదు. వరుణ్ ధావన్ హీరోగా ఆయన తండ్రి డేవిడ్ ధావన్ ప్లాన్ చేసుకున్న ఎంటర్ టైనర్ కోసం అడిగారు. కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. శ్రీలీల దాన్ని దాదాపు వదులుకున్నట్టే. అసలే వరుణ్ మార్కెట్, ఇమేజ్ రెండూ డౌన్ లో ఉన్నాయి. కామెడీగా చేసిన కూలి నెంబర్ వన్ నుంచి మాస్ గా ట్రై చేసిన బేబీ జాన్ దాకా అన్నీ టపా కట్టేశాయి. కానీ కార్తీక్ ఆర్యన్ మంచి స్వింగ్ లో ఉన్నాడు. ఇటీవలే భూల్ భులయ్యా 3 పెద్ద హిట్టయ్యింది. పెద్ద ప్రొడక్షన్ కంపెనీలతో వరసగా సినిమాలు చేస్తూ బిజినెస్ పెంచుకుంటూ పోతున్నాడు.
మరి శ్రీలీల ఎస్ చెప్పిందో లేదో ఇంకొద్దిరోజుల్లో తేలనుంది. అసలే టాలీవుడ్ హీరోయిన్లకు బాలీవుడ్ అంతగా అచ్చి రావడం లేదు. తనకైనా లక్కు కలిసి వస్తుందో లేదో చూడాలి. నితిన్ తో చేసిన రాబిన్ హుడ్ విడుదలకు సిద్దమవుతూ ఉండగా శివ కార్తికేయన్ తో సుధా కొంగర దర్శకత్వంలో రూపొందబోయే భారీ చిత్రం ఇటీవలే మొదలైంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యాక డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రవితేజ కాంబో రిపీటవుతున్న మాస్ జాతర మే రిలీజ్ కు రెడీ అవుతోంది. 2025 నుంచి శ్రీలీల డైరిలో పేజీలు ఖాళీగా ఉండేలా కనిపించడం లేదు. స్పీడలా ఉంది మరి.
This post was last modified on January 3, 2025 3:07 pm
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…