దక్షిణాదిన అన్ని భాషల వాళ్లకూ పరిచయమున్న మలయాళ నటుల్లో టొవినో థామస్ ఒకడు. ‘లూసిఫర్’ సినిమ చూసిన వాళ్లందరికీ అతను బాగానే తెలుసు. ఈ మధ్య ‘ఆహా’లో రిలీజైన ‘ఫోరెన్సిక్’తో మన వాళ్లను బాగా ఆకట్టుకున్నాడు టొవినో.
ప్రస్తుతం ‘కాలా’ అనే సినిమాలో నటిస్తున్న ఈ యువ నటుడు దానికి సంబంధించి ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ గాయాన్ని అంతగా పట్టించుకోకపోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చి అత్యవసరంగా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. టొవినోను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారన్న వార్త అందరిలోనూ కలవరం రేపింది. అంత సీరియస్ ఏమైందని అందరూ ఆందోళన చెందారు. ఐతే ఈ యంగ్ యాక్టర్ ఇప్పుడు ఔట్ ఆఫ్ డేంజర్ అని వెల్లడైంది.
చికిత్స అనంతరం కోలుకున్న టొవినో థామస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసుపత్రి నుంచి బయటికి వస్తూ ఒక ఫొటో తీసుకున్న టొవినో.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ అనుభవం తనను మేల్కొల్పిందని, తన విషయంలో తాను కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ యాక్సిడెంట్ తర్వాత ఆ విషయం తనకు బాగా బోధ పడిందని, ఇకపై జాగ్రత్తగా ఉంటానని టొవినో చెప్పాడు. ఆసుపత్రిలో తనను వైద్య సిబ్బంది చాలా బాగా చూసుకున్నారని, ఇది తనకొక అందమైన అనుభవమని టొవినో చెప్పడం విశేషం.
కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోబోతున్నాడు టొవినో. పూర్తిగా కోలుకున్నాక తిరిగి ‘కాలా’ షూటింగ్‌కు వెళ్లనున్నాడు. తాను కోలుకోవాలని కోరుతూ, తనకు వెల్కమ్ చెబుతూ తన చిన్నారి కొడుకులిద్దరూ స్కెచ్‌లతో రాసిన అందమైన నోటీస్ బోర్డును అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
This post was last modified on October 13, 2020 2:26 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…