Movie News

నాగచైతన్యకు అల్లు అరవింద్ హామీ

తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్ కేసులో ఇరుక్కోవడం, తర్వాత జరిగిన పరిణామాల వల్ల గీతా ఆర్ట్స్ బృందం రెండు వారాలకు పైగా ఆ ఒత్తిడిలోనే ఉండిపోయింది. దీంతో తండేల్ పబ్లిసిటీ మీద దృష్టి పెట్టేందుకు మనసు రాలేదు. ఇంకోవైపు ఈ పరిణామాలు అక్కినేని ఫ్యాన్స్ కి మనస్థాపం కలిగించాయి. చైతు కెరీర్ లోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీకి ప్రమోషన్లు మొదలుకాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కారణాలు జెన్యూన్ గా ఉండటం వల్ల ఎవరిని ఏం అనలేని పరిస్థితి.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7 విడుదల మీద సందేహాలు ముసురుకోవడంతో అలాంటిదేమి లేదని, ఖచ్చితంగా చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని అల్లు అరవింద్ చైతుకి చెప్పడంతో పాటు తనను కలిసిన కొందరు ఫ్యాన్స్ కి హామీ ఇచ్చినట్టు సమాచారం. అంతే కాదు బన్నీ వ్యవహారం కొలిక్కి వస్తోంది కాబట్టి ఇకపై ప్రమోషన్ ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేక దృష్టి పెడతామని, బన్నీ వాస్ తో కలిసి ప్రణాళికను సిద్ధం చేయబోతున్నామని చెప్పారట. సో అభిమానులు టెన్షన్ పడేందుకు ఏమి లేదు. చిన్న ప్యాచ్ వర్క్ మినహా తండేల్ దాదాపు పూర్తయ్యే స్టేజిలోనే ఉంది.

దర్శకుడు చందూ మొండేటి టైం వృధా కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఇప్పటిదాకా వచ్చింది ఒక పాటనే. కీలకమైన రెండో జాతర సాంగ్ ని ఎల్లుండి రిలీజ్ చేయబోతున్నారు. లవ్ స్టోరీతో సూపర్ హిట్ అందుకున్న చైతు, సాయిపల్లవి జంట ఈసారి మరింత కనువిందు చేయడం ఖాయమని టాక్. పాకిస్థాన్ లో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్లను విడిపించే హీరో కథతో తండేల్ రూపొందింది. యాక్షన్, ఎమోషన్స్, మ్యూజిక్, మాస్ ఎలిమెంట్స్ ఇలా అన్ని వర్గాలను టార్గెట్ చేసుకున్నవి తండేల్ లో పుష్కలంగా ఉన్నాయట. చైతు మాత్రం ధీమాగా ఉన్నాడు.

This post was last modified on January 2, 2025 3:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అంబానీ చేత చప్పట్లు కొట్టించిన కుర్రాడు…

ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…

10 minutes ago

‘పులిరాజు’ ఫోటో వెనుక అసలు కథ

ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…

24 minutes ago

అరవింద్ మాటల్లో అర్థముందా అపార్థముందా

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…

28 minutes ago

బాలయ్యకు తిరుగు లేదు… ‘హిందూపురం’పై టీడీపీ జెండా

టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…

45 minutes ago

వరల్డ్ కప్ వీర వనితలకు బీసీసీఐ భారీ నజరానా!

మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌ను వరుసగా రెండోసారి గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గౌరవార్థంగా భారీ నగదు బహుమతి…

47 minutes ago

‘కాంప్లికేటెడ్’ ఐడియా బాగుంది సిద్దూ

బాక్సాఫీస్ వద్ద మోస్ట్ పేయబుల్ హీరోల్లో ఒకడిగా మారిన సిద్దు జొన్నలగడ్డకు సినిమాల పరంగా మధ్యలో బాగానే గ్యాప్ వస్తోంది.…

52 minutes ago