Movie News

తమన్ VS భీమ్స్ : ఎవరిది పైచేయి

సంక్రాంతి సినిమాలకు హైప్ తీసుకొచ్చే విషయంలో సంగీతం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మళ్ళీ చెప్పనక్కర్లేదు. గత ఏడాది గుంటూరు కారంకు కుర్చీ మడతపెట్టి చేసిన ప్రమోషన్ అంతా ఇంతా కాదు. అందుకే ఈసారి ఎలాంటి ఆల్బమ్స్ ఉంటాయనే దాని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది. మూడులో రెండింటికి తమన్ పని చేయడం గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ మీద అంచనాలు పెంచింది. స్టార్ హీరోలకు తక్కువగా పని చేసిన భీమ్స్ కు సంక్రాంతికి వస్తున్నాం దక్కినా బజ్ పరంగా అది చివరి స్థానంలో ఉండేది. తీరా పండగకు పది రోజులు ముందు చూస్తుంటే సీన్ రివర్స్ అయిపోయింది.

వెంకటేష్ కి భీమ్స్ ఇచ్చిన మూడు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. వాటిని అనిల్ రావిపూడి తెరకెక్కించిన తీరుతో పాటు ఆడియోగా వినడానికి బాగుండటంతో వ్యూస్ లోనూ గోదారి గట్టు లాంటివి పై చేయి సాధించాయి. ఇటీవలే వచ్చిన వెంకీ స్వయంగా పాడిన సాంగ్ సైతం మాస్ కి వేగంగా ఎక్కేస్తోంది. ఇంకోవైపు తమన్ వి స్లో పాయిజన్ లా వెళ్తున్నాయి కానీ భీమ్స్ ని డామినేట్ చేయలేకపోవడం షాక్. డాకు మహారాజ్ రెండు పాటలు ఓ మోస్తరుగా వెళ్లాయి తప్ప అఖండ, వీరసింహారెడ్డి స్థాయిలో వైరల్ కాలేదు. దబిడి దబిడి ఏమైనా మేజిక్ చేస్తుందేమో చూడాలి. బాలయ్యతో తమన్ పనిచేయడం ఇది నాలుగోసారి.

ఇక గేమ్ చేంజర్ బాగానే ప్రభావం చూపించినా దీని రేంజ్ కి తగ్గ పాటలు కాదనేది ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న కామెంట్. విజువల్ గా గొప్పగా ఉండొచ్చు, చరణ్ డాన్స్ అదిరిపోయి ఉండొచ్చేమో కానీ అంచనాల బరువు ఎక్కువ ఉండటం వల్ల మోయడం కష్టమైపోయింది. అయితే ఇక్కడితో ఎవరు బెస్ట్ అని తీర్పు ఇవ్వలేం. థియేటర్లలో తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ద్వారా తమన్ తీసుకొచ్చే ఎలివేషన్ వేరే లెవెల్ లో ఉంటుంది. సో చరణ్, బాలయ్యలకు ఎలాంటి బిజీఎం ఇచ్చాడనే దాన్ని బట్టి తుది తీర్పు ఇవ్వగలం. సంక్రాంతి వస్తున్నాంకి బీజీఎమ్ పరంగా వెయిట్ తక్కువ ఉండొచ్చు కనక జనవరి 14 దాకా వేచి చూడాలి.

This post was last modified on January 2, 2025 1:05 pm

Share
Show comments

Recent Posts

ఎమ్మెల్యే పుత్రుడు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు

ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…

8 minutes ago

SSMB 29 : ఊహకందని స్థాయిలో రాజమౌలి స్కెచ్!

మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…

9 minutes ago

ఉప ఎన్నికలకు సిద్ఘమంటున్న కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…

41 minutes ago

ఆ చేప రేటు 3.95 లక్షలు.. ఎందుకంటే…

కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్‌లో…

1 hour ago

ఈసారి ‘అక్కినేని లెక్కలు’ మారబోతున్నాయా

ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…

1 hour ago

ఆగని పూజా ఫ్లాప్ స్ట్రీక్…

అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…

2 hours ago