Movie News

లైకా పొరపాటు – మైత్రి గ్రహపాటు

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరున్న మైత్రి మూవీ మేకర్స్ గత ఏడాది అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రకటించిన రోజే 2025 సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. అప్పటికే షూటింగ్ లో ఉన్న విడాముయర్చి 2024 దసరా లేక దీపావళికి వస్తుందనే ఖచ్చితమైన నమ్మకంతో అజిత్ అంగీకరించాడు. అయితే జరిగింది వేరు. ప్రొడక్షన్ లో జరిగిన ఆలస్యం, దర్శకుడి అలసత్వం, ప్రమాదంలో హీరో గాయపడటం లాంటి ఎన్నో కారణాలు విడాముయర్చిని కొన్ని నెలల పాటు హోల్డ్ లో పెట్టేశాయి. ఇటు పక్క గుడ్ బ్యాడ్ అగ్లీ చిన్న చిన్న ఆటంకాలు తప్ప నిర్విఘ్నంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

కానీ కొన్ని వారాల క్రితం లైకా హఠాత్తుగా విడాముయార్చిని సంక్రాంతి రిలీజని చెప్పడంతో మైత్రి షాక్ తింది. ప్రాధాన్యత క్రమంలో అజిత్ ముందు ఒప్పుకున్న దాని ప్రకారం ఈ నిర్ణయానికి ఎస్ అనడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఒకవేళ లైకా కనక ఇలా చేసుండకపోతే గుడ్ బ్యాడ్ అగ్లీని అనుకున్న టైంకే రిలీజ్ చేసేవాళ్ళేమో. ఇప్పుడు బంగారం లాంటి పండగ ఛాన్స్ మిస్ అయిపోయింది. మంకత (గ్యాంబ్లర్) రేంజ్ లో ఈ సినిమా మీద అభిమానుల అంచనాలున్నాయి. అందులోనూ కరుడు గట్టిన అజిత్ వీరాభిమాని ఆధిక్ రవిచంద్రన్ దర్శకుడు కావడంతో మరింత పైకెళ్ళాయి. అచ్చం పవన్ ఓజిలాగా.

ఇంత జరిగిన తర్వాత విడాముయార్చి పొంగల్ నుంచి తప్పుకుంది. ఇలా జరగడం వల్ల మైత్రికి పెద్ద బ్లాక్ బస్టర్ సీజన్ మిస్సయ్యింది. తమ ప్రమేయం లేకుండానే భారీ రికార్డులు వదులుకుంది. విజయ్, రజనీకాంత్ లేని సంక్రాంతికి అజిత్ కనక వచ్చి ఉంటే ఎంత లేదన్నా అయిదు వందల కోట్ల గ్రాస్ తెచ్చేవాడని చెన్నై ట్రేడ్ బల్లగుద్ది చెబుతోంది. కంటెంట్ పరంగా విడాముయార్చి కన్నా గుడ్ బ్యాడ్ అగ్లీకే ఆ ఛాన్స్ ఎక్కువగా ఉందని, మాస్ లో రీచ్ ఊహించని స్థాయిలో నెలకొందని పెదవి విరుస్తున్నారు. మొత్తానికి తమిళంలో పెద్ద జెండా పాతాలని ప్లాన్ చేసుకున్న మైత్రికి ఈ పరిణామాలు ఇబ్బందిపెట్టేవే. పరిస్థితి అలా వచ్చింది మరి.

This post was last modified on January 1, 2025 5:14 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

2 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 hours ago