7/జి బృందావన కాలనీ.. ఈ పేరు వింటే 2000 నాటి యూత్ అంతా ఒక పులకింతకు గురవుతారు. అలాగే వారిలో ఒక రకమైన నిర్వేదం కూడా కలుగుతుంది. ఆ సినిమా అప్పటి యువ ప్రేక్షకులను ప్రేమ భావనల్లో ముంచెత్తి.. షాకింగ్ ట్విస్టుతో వాళ్లను కుదేలు చేసిన సినిమా అది. తమిళం అనే కాక ఇండియాలో వచ్చిన ఆల్ టైం బెస్ట్ లవ్ స్టోరీల్లో ఒకటిగా దీన్ని చెప్పుకోవచ్చు. సీనియర్ నిర్మాత ఏఎం రత్నం తనయుడు రవికృష్ణను హీరోగా పరిచయం చేస్తూ ధనుష్ అన్న సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రమిది.
తమిళంలోనే కాక తెలుగులోనూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. సెల్వ రాఘవన్ నుంచి వేరే హిట్ చిత్రాలు కూడా వచ్చినా.. దీని ప్రత్యేకతే వేరు. ఇప్పుడు ఈ కల్ట్ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతుండడం విశేషం. చాలా ఏళ్ల నుంచి సరైన విజయాలు లేని సెల్వ.. ఇప్పుడు తన క్లాసిక్ మూవీకి సీక్వెల్ తీస్తున్నాడు. ‘7/జి బృందావన కాలనీ’ తర్వాత రవికృష్ణ వరుసగా కొన్ని సినిమాలు చేశాడు కానీ.. అవన్నీ తీవ్రంగా నిరాశపరిచాయి.
తర్వాత అతను సినిమాలే మానేశాడు. గత 15 ఏళ్లలో రవికృష్ణ నుంచి సినిమాలే రాలేదు. ఇక మళ్లీ అతణ్ని స్క్రీన్ మీద చూడలేమనుకున్నారంతా. తన గురించి అందరూ మరిచిపోయిన సమయంలో అతణ్నే హీరోగా పెట్టి ‘7/జి బృందావన కాలనీ’కి సీక్వెల్ తీస్తున్నాడు సెల్వ రాఘవన్. వీళ్లిద్దరికీ ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం. ‘7/జి బృందావన కాలనీ’ ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచే ఈ కథ మొదలవుతుందట. రవి జీవితంలోకి కొత్తమ్మాయి వచ్చాక తన జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో ఇందులో చూపిస్తారట.
ఆ కొత్తమ్మాయి పాత్రను మలయాళ కథానాయిక అనస్వర రాజన్ చేస్తోంది. ఐతే జనాలు పూర్తిగా మరిచిపోయిన హీరో.. చాలా ఏళ్ల నుంచి ఫాంలో లేని దర్శకుడు కలిసి.. రెండు దశాబ్దాల కిందట తమ కలయికలో వచ్చిన కల్ట్ మూవీకి సీక్వెల్ తీసి అంచనాలను ఏమేర అందుకోగలరు అన్నది సందేహం. అలాంటి క్లాసిక్‌లను టచ్ చేయకపోవడమే మంచిదన్న అభిప్రాయాలున్నాయి. మరి సెల్వ రాఘవన్ మళ్లీ అలాంటి మ్యాజిక్ చేయగలిగితే అద్భుతమే అవుతుంది.
This post was last modified on January 1, 2025 2:33 pm
మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా…
సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్ కోసం టాలీవుడ్ బాగానే…
విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…
ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…
ఏపీ సీఎం చంద్రబాబు ఒక పని పెట్టుకున్నారంటే.. దాంతోనే సరిపుచ్చుకోరు. దానికి అనుబంధంగా ఉన్న ఇతర పనులను కూడా సర్దుకుని…
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…