కొత్త ఏడాది మొదలైపోయింది. బాక్సాఫీస్ కొత్త ఆశలతో చిగురిస్తోంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం ప్యాన్ ఇండియా సినిమాలతో తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ ప్రభావం చూపించబోతోంది. దానికి ‘గేమ్ ఛేంజర్’ శ్రీకారం చుట్టనుంది. రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో మూడు వందలకు కోట్లకు పైగా బడ్జెట్ తో సుదీర్ఘ నిర్మాణం జరుపుకుని భారీ అంచనాలు మోస్తోంది. మెగా పవర్ స్టార్ బోణీ ఎలా ఉంటుందో చూడాలి. ఫిబ్రవరిలో నాగచైతన్యకు ‘తండేల్’ పెద్ద పరీక్ష పెట్టనుంది. ప్రీ రిలీజ్ లోనే పాజిటివ్ వైబ్స్ మోస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో సాయిపల్లవి హీరోయిన్ కావడం హైప్ పెంచుతోంది.
డిప్యూటీ సిఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి మూవీగా ‘హరిహర వీరమల్లు’ని నిర్మాత ఏఎం రత్నం, దర్శకులు క్రిష్ – జ్యోతికృష్ణ ఒక తపస్సులా చేశారు. ఎప్పుడు చూడని విజువల్స్, గ్రాండియర్ తో గొప్ప అనుభూతినిస్తుందనే నమ్మకం టీమ్ లో ఉంది. గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న ‘విజయ్ దేవరకొండ 12’ ఎప్పుడు వస్తుందనేది ఇంకా నిర్ణయం కాలేదు. శ్రీలంక బ్యాక్ డ్రాప్ తో షాకింగ్ కంటెంట్ ఆశ్చర్యపరుస్తుందని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మీదున్న అంచనాలు చెప్పనక్కర్లేదు. కొత్త డేట్ ఇంకా తెలియాల్సి ఉంది. చిరంజీవి ‘విశ్వంభర’ ఆయన కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తీస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మోస్ట్ వాంటెడ్ ‘ఓజి’ గురించి ఫ్యాన్స్ చేస్తున్న జపం, దాని చుట్టూ అల్లుకున్న హైప్ గురించి వర్ణించాలంటే మాటలు చాలవు. రిలీజ్ విషయం తేలాల్సి ఉంది. అనుష్క ‘ఘాటీ’లో పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ తీసుకోవడం హైప్ పెంచుతోంది. హనుమాన్ తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకుని తేజ సజ్జ చేసిన ‘మిరాయ్’ విషయంలో పీపుల్స్ మీడియా రాజీపడటం లేదు.
మంచి విష్ణు ‘కన్నప్ప’లో మల్టీస్టారర్ క్యామియోలు భారీ ఆకర్షణగా నిలుస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ‘వార్ 2’ ఇండియన్ స్క్రీన్ మీదే బెస్ట్ యాక్షన్ మూవీ అవుతుందనే రేంజ్ లో బాలీవుడ్ విశ్లేషణాలున్నాయి. సెప్టెంబర్ లో ఒకే రోజు తలపడనున్న బాలకృష్ణ ‘అఖండ 2’, సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’లు ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఆడియన్స్ కట్టిపడేసేలా ఉంటాయని వినికిడి.
ప్యాన్ ఇండియా ట్యాగ్ ఉన్నా లేకపోయినా బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, నాని హిట్ 3 ది థర్డ్ కేస్, సిద్ధూ జొన్నలగడ్డ జాక్, రవితేజ మాస్ జాతర, విశ్వక్ సేన్ లైలా, నితిన్ రాబిన్ హుడ్ లాంటి సినిమాలు బిజినెస్ పరంగా చూపిస్తున్న క్రేజ్ భారీగానే ఉన్నాయి. ఇక్కడ చెప్పనవి ఎన్నో ప్రమోషన్ల స్టేజి నుంచి జనాల దృష్టిలో పడేవి లేకపోలేదు. వేల కోట్ల బిజినెస్ తో 2025 సరికొత్త దిశానిర్దేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దేవర, సలార్, పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్లు వేసిన పునాదిని బలమైన భవంతిగా మార్చేందుకు తెలుగు దర్శక రచయితలు, నిర్మాతలు చేస్తున్న కృషి వెలకట్టలేనిది.
This post was last modified on January 1, 2025 11:06 am
టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్…
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో తన కంబ్యాక్ ఇస్తానని అభిమానులను ఊరిస్తున్న దర్శకుడు శంకర్ దానికి తగ్గట్టే ట్రైలర్ ద్వారా…
కొన్నిసార్లు సినిమాల పరంగా జరిగే సంఘటనలు యాదృచ్చికమే అయినా విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. జనవరి 10 విడుదల…
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు వృత్తి అవకాశాల కోసం ఓపీటీపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నారు. హెచ్1బీ వీసాలు పొందేందుకు ఈ…
టాలీవుడ్లో పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారసులకు కూడా లేని అరంగేట్రం బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కు దక్కింది. బెల్లంకొండ సురేష్…
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల…