నిన్న రాత్రి నూతన సంవత్సర సందర్భంగా ఏదైనా కానుక ఇవ్వాల్సింది పోయి అజిత్ అభిమానులకు ఏకంగా షాక్ ఇచ్చింది లైకా ప్రొడక్షన్స్. విడాముయార్చిని పొంగల్ కి విడుదల చేయడం లేదని ప్రకటించడంతో ఒక్కసారిగా తలా ఫ్యాన్స్ ఏమనాలో అర్థం కాని పరిస్థితికి వెళ్లిపోయారు. ఎందుకంటే ఈ సినిమా కోసమే భారీ అంచనాలున్న గుడ్ బ్యాడ్ అగ్లీని మైత్రి సంస్థ వాయిదా వేసుకుంది. తీరా చూస్తే ఇప్పుడదేదో సామెత చెప్పినట్టు ఉన్నది పోయింది లేనిది పోయిందిలా సీన్ రివర్స్ అయ్యింది. దీంతో కోలీవుడ్ సంక్రాంతికి సరైన పెద్ద స్టార్ హీరో సినిమా లేకపోవడం అక్కడి బాక్సాఫీస్ కు షాకే.
ఇది రామ్ చరణ్ కు గొప్ప ప్రయోజనం కలిగించనుంది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ కు తమిళనాడులో థియేటర్లు ఏ మేరకు దొరుకుతాయనే దాని మీద అనుమానాలు లేకపోలేదు. అజిత్ బొమ్మ బరిలో ఉంటే ఎగ్జిబిటర్ల మొదటి ప్రాధాన్యం అదే అవుతుంది. కానీ ఇప్పుడు లేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఆర్ఆర్ఆర్ హీరో, శంకర్ డైరెక్టర్ కాంబోకు క్రేజ్ పెరుగుతుంది. ఇప్పటికే చెన్నై వర్గాల్లో గేమ్ ఛేంజర్ గురించిన ఇన్ సైడ్ రిపోర్ట్స్ చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. అదే కనక నిజమైతే మంచి ఓపెనింగ్స్ తో పాటు పుష్ప 2 తరహాలో పెద్ద రన్ దక్కే అవకాశాలు పెరుగుతాయి. ఇదంతా దిల్ రాజుకు కలిసొచ్చే అంశమే.
సో చరణ్ ఫ్యాన్స్ నిశ్చితంగా ఉండొచ్చు. అయితే కాంపిటీషన్ అస్సలు లేదని కాదు. జనవరి 10 అరుణ్ విజయ్ వనంగానన్ వస్తోంది. విడాముయార్చి తప్పుకోవడం ముందే గుర్తించి రెండు రోజుల క్రితం అనౌన్స్ మెంట్ ఇచ్చారు. దర్శకుడు బాలా కావడంతో దీని హైప్ ని తక్కవంచనా వేయలేం. కాకపోతే రా కంటెంట్ కాబట్టి మాస్ జనాలకు ఏ మేరకు ఎక్కుతుందనేది ఇప్పుడే చెప్పలేం. కానీ గేమ్ ఛేంజర్ కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ కనక టాక్ బాగుంటే క్లాస్, మాస్ ఇద్దరి మద్దతు దక్కుతోంది. చెన్నైలో ఒక ఈవెంట్ చేయాలనే ఆలోచనలో ఎస్విసి టీమ్ ఉంది కానీ దానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
This post was last modified on January 1, 2025 10:40 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…