Movie News

డ్రగ్స్ వద్దు డార్లింగ్స్… ప్రభాస్ పిలుపు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సామాజిక కార్యక్రమాలపై, డ్రగ్స్ వ్యతిరేక అవగాహనా కార్యక్రమాలపై సినీ ప్రముఖులు ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పిలుపునకు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్పందించారు. న్యూ ఈయర్ వేడుకల సందర్భంగా ‘‘సే నో టు డ్రగ్స్ డార్లింగ్స్’’ అంటూ డ్రగ్స్ వ్యతిరేక అవకగాహనా కార్యక్రమాన్ని ప్రభాస్ ప్రారంభించారు.

డ్రగ్స్‌ వద్దు అంటూ యువత, ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రభాస్ ఓ వీడియో విడుదల చేశారు. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు ఉన్నారని ప్రభాస్ చెప్పారు. అటువంటపుడు డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్ అంటూ ప్రభాస్ తన అభిమానులతో పాటు డ్రగ్స్ అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికీ సందేశమిచ్చాడు.

జీవితంలో మనకు బోలెడన్నీ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని, కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని, డ్రగ్స్‌కు నో చెప్పాలని బాహుబలి తన స్టైల్లో పిలుపునిచ్చారు. అంతేకాదు, మన స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే వెంటనే 87126 -71111 నెంబర్కు ఫోన్ చేయాలని ప్రభాస్ చెప్పారు. డ్రగ్స్కు బానిసలైన వాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.

ప్రభాస్ ఒక్కరే కాదు, ఇంకా చాలామంది సినీ ప్రముఖులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరగబోయే అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. దాంతోపాటు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే పలు సామాజిక కార్యక్రమాలపై కూడా టాలీవుడ్ ప్రముఖులు ప్రచారం చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే, కుల గణనపై ప్రచారం చేసేందుకు మాత్రం సినీ ప్రముఖులు విముఖంగా ఉన్నారని తెలుస్తోంది.

This post was last modified on December 31, 2024 8:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నాని పట్టుదల – అనిరుధ్ చేతికి ప్యారడైజ్

దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…

1 hour ago

కోటి తీసుకుంటే.. సూటుతోనే రావాలా?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…

2 hours ago

స్పిరిట్ తర్వాత సందీప్ వంగా హీరో ఎవరు

యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…

3 hours ago

‘తిరుగుబాటు’ సూత్రధారి ‘వెండి’ కొండేనట

తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ…

3 hours ago

పాత ట్రెండును కొత్తగా తీసుకొచ్చిన పుష్ప 2

ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు…

4 hours ago

బొత్స రెడీ… లోకేశ్ దే లేట్

వైసీపీ కీలక నేత, ఏపీ శాసనమండలిలో విపక్ష నేతగా సాగుతున్న బొత్స సత్యనారాయణ సెలవు దినం అయిన ఆదివారం అధికార…

4 hours ago