Movie News

మోస్ట్ అవైటెడ్ సిరీస్… రెడీ

ఇండియన్ వెబ్ సిరీస్‌ల్లో అత్యంత ఆదరణ పొందింది ఏది అంటే మరో మాట లేకుండా ‘ఫ్యామిలీ మ్యాన్’ అని చెప్పేయొచ్చు. వెబ్ సిరీస్‌లు అంటే యూత్ మాత్రమే చూస్తారు అనే అభిప్రాయాన్ని ఇది మార్చేసింది. అది యూత్‌ ఎంజాయ్ చేసేలా థ్రిల్లింగ్‌గా సాగుతూనే.. వల్గర్ కంటెంట్ లేకుండా, ఫ్యామిలీ డ్రామా కూడా కలగలిసి కుటుంబ ప్రేక్షకులను సైతం అమితంగా ఆకట్టుకుంది. ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయ్యాక రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురు చూశారు.

వారి నిరీక్షణకు తెరదించుతూ 2021 జూన్‌లో సెకండ్ సీజన్‌ను రిలీజ్ చేసింది అమేజాన్ ప్రైమ్. అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఉన్న సెకండ్ సీజన్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అప్ప‌ట్నుంచి ఫ్యామిలీ మ్యాన్-3 కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఐతే ఈ సిరీస్ సెట్స్ మీదికి వెళ్లడంలోనే చాలా ఆలస్యం జరిగింది. ఫ్యామిలీ మ్యాన్ రూపకర్తలు రాజ్-డీకే మధ్యలో మూడు వెబ్ సిరీస్‌లు తీశారు. అవే.. ఫర్జి, గన్స్ అండ్ గులాబ్స్, సిటాడెల్. ఐతే వీటిలో ‘ఫర్జి’ మెప్పించినా.. మిగతా రెండూ నిరాశపరిచాయి.

‘సిటాడెల్’ అయితే ఏమాత్రం సౌండ్ చేయలేకపోయింది. దీంతో రాజ్-డీకే ఫోకస్ ‘ఫ్యామిలీ మ్యాన్-3’ మీదికి మళ్లింది. ‘సిటాడెల్’ రిలీజైన రెండు నెలలకే ‘ఫ్యామిలీ మ్యాన్-3’ షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. ‘సిటాడెల్’ చేస్తున్న సమయంలోనే ‘ఫ్యామిలీ మ్యాన్-3’ చిత్రీకరణ కూడా కొంత పూర్తి చేశారు రాజ్-డీకే. ఇప్పుడు ఆ సిరీస్ షూట్ అంతా అయిపోయింది. ఈ విషయాన్ని దీని లీడ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి స్వయంగా ప్రకటించాడు.

ఇన్నేళ్లలో సినిమాలతో మనోజ్ తెచ్చుకున్న గుర్తింపు ఒకెత్తయితే.. ‘ఫ్యామిలీ మ్యాన్’తో సంపాదించిన పేరు మరో ఎత్తు. మధ్యలో అతడి నుంచి కూడా కొన్ని నిరాశాజనక సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. ఇటు మనోజ్ అభిమానులు, అటు రాజ్-డీకే ఫ్యాన్స్ ఎదురు చూస్తోంది ‘ఫ్యామిలీ మ్యాన్-3’ కోసమే. షూట్ అయిపోయిందంటే త్వరలోనే సిరీస్ స్ట్రీమ్ కాబోతుందన్నమాట.

ఫ్యామిలీ మ్యాన్-3 ఇండియా మీద‌ చైనా ఎటాక్ చేసే బ్యాక్ డ్రాప్‌లో న‌డుస్తుంద‌ని రెండో సీజ‌న్ చివ‌ర్లోనే హింట్ ఇచ్చారు. ఈ సిరీస్ ఈశాన్య భారత నేప‌థ్యంలో సాగుతుంది. అక్క‌డే చిత్రీక‌ర‌ణ కూడా జరిగింది.

This post was last modified on December 30, 2024 8:14 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

1 hour ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

1 hour ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

5 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago