అక్కినేని అఖిల్‍కి అనుకోకుండా సురేందర్ లాంటి పెద్ద దర్శకుడితో పని చేసే అవకాశం వచ్చింది. స్టార్ హీరోలు ఎవరూ ఖాళీగా లేకపోవడంతో సురేందర్ తన తదుపరి చిత్రానికి అఖిల్‍ని ఎంచుకున్నాడు. సురేందర్ చెప్పిన బడ్జెట్ ఎక్కువ కావడంతో నిర్మాత ధైర్యం చేయకపోతే సురేందర్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నాడు. జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ కథా చిత్రమని దీని గురించి చెబుతున్నారు.
ఇదిలావుంటే ఇందులో కథానాయికగా రష్మిక కావాలని అఖిల్ పట్టుబట్టాడట. ఇంతకుముందు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‍లర్’ చిత్రంలో పూజ హెగ్డేను తీసుకోవాలని కూడా అఖిల్ చాలా పట్టు పట్టి సాధించుకున్నాడు. అగ్ర హీరోయిన్లు తన సినిమాలో వుంటే క్రేజ్ తోడవుతుందనేది అఖిల్ ఆలోచన కావచ్చు. పూజ, రష్మిక ఇప్పుడు టాలీవుడ్‍లో టాప్ హీరోయిన్లు. సూపర్‍స్టార్ల పక్కన నటిస్తోన్న వీరికి అఖిల్ పక్కన సినిమా అంటే ఖచ్చితంగా భారీ పారితోషికం ఇవ్వక తప్పదు.
తన పారితోషికం పరంగా ఎలాంటి కండిషన్లు పెట్టని అఖిల్ హీరోయిన్ల పరంగా మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నాడు. మరి క్రేజీ హీరోయిన్ల థియరీ అఖిల్‍ని ఫ్లాపుల నుంచి బయట పడేసి హిట్ అయ్యేట్టు చూస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
This post was last modified on October 13, 2020 7:45 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…