Movie News

యానిమల్ పోలిక వద్దు బాసూ…

కొద్దిరోజుల క్రితం బేబీ జాన్ ప్రమోషన్లలో నిర్మాత అట్లీ మాట్లాడుతూ రన్బీర్ కపూర్ కి యానిమల్ ఎలా అయితే సూపర్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిందో వరుణ్ ధావన్ కు తమ సినిమా అదే ట్యాగ్ ఇస్తుందని ఓ రేంజ్ లో బిల్డప్ ఇస్తూ చెప్పాడు. దీనికి బాలీవుడ్ మీడియా విస్తుపోయి చూసింది. ఎందుకంటే తేరి కథేంటో, తమిళంలో అంత పెద్ద హిట్టవ్వడానికి కారణాలు ఏంటో వాళ్లకు తెలుసు కాబట్టి. అయితే యానిమల్ లాంటి ఒరిజినల్ కంటెంట్ ని తన రొటీన్ స్టోరీతో పోల్చుకోవడం కొంచెం అతిగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన వాళ్ళు బోలెడున్నారు. సామాన్య ప్రేక్షకులు నిజంగా అంత సీన్ ఉందా అంటూ ఆశ్చర్యపోయారు.

తీరా చూస్తే బేబీ జాన్ 2024లోనే అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలుస్తోంది. కేవలం జవాన్ బ్రాండ్ ని వాడుకుని అట్లీ చేసిన మార్కెటింగ్ ఏ మాత్రం ఫలితం ఇవ్వలేదు సరికదా ఏదో మొహమాటం కొద్దీ కథకు సంబంధం లేని క్యామియో చేసినందుకు సల్మాన్ ఖాన్ కు సైతం నెగటివ్ ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చింది. అట్లీతో తర్వాత సినిమా చేయబోయేది కండల వీరుడే. ఈ స్టేట్ మెంట్ ఒక్కటే కాదు పలు ఇంటర్వ్యూలో ఈ దర్శకుడు చేసిన కామెంట్లు ఓవర్ కాన్ఫిడెన్స్ ని చూపించాయి. ఇవన్నీ బేబీ జాన్ మీద అవసరం లేని హైప్ పెంచేసి తీరా థియేటర్లో చూశాక ఉసూరని నిరాశ కలిగించేలా చేశాయి. ఫ్లాప్ మూటగట్టాయి.

ఒకటి మాత్రం నిజం. యానిమల్ అంత సులభంగా పోల్చుకోలేని, దాటలేని ఆర్గానిక్ బ్లాక్ బస్టర్. మూడున్నర గంటలు చూపించినా జనం బోర్ కొట్టకుండా చూస్తారని మొదట దారి చూపించిన క్లాసిక్ హిట్. ఇది చూపించిన ధైర్యంతోనే పుష్ప 2కి అంతే నిడివిని లాక్ చేసుకున్నాడు సుకుమార్. రన్బీర్ కపూర్ కి సూపర్ స్టార్ అర్హత ఉందని నిరూపించింది కూడా ఈ సినిమానే. అలాంటిది బేబీ జాన్ లాంటి రొటీన్ మూవీతో పోల్చుకోవడం కరెక్ట్ కాదని నెటిజన్ల ఫీలింగ్. ఏది ఏమైనా బజ్ కోసమని ఓవర్ బోర్డ్ స్టేట్ మెంట్లు ఇస్తే ఏమవుతుందో మరోసారి బేబీ జాన్ రూపంలో నిరూపితం అయ్యింది. ఇకపై ఎవరు ఈ పొరపాటు చేయరేమో.

This post was last modified on December 30, 2024 4:11 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

31 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago