ఇప్పుడు దేశంలో ట్రూ పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాస్ అనే చెప్పాలి. బాలీవుడ్ స్టార్లకు ఉత్తరాదిన ఎంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సౌత్‌కు వచ్చేసరికి వాళ్ల హవా అంతంతమాత్రమే. ఇక సౌత్‌లో హవా సాగించే స్టార్లకు నార్త్‌లో ఫాలోయింగ్ తక్కువ. కానీ ప్రభాస్ అలా కాదు. ‘బాహుబలి’తో అన్ని చోట్లా పెద్ద స్టార్ అయిపోయాడు.
ఉత్తరాదిన కూడా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రభాస్ సినిమాలకు కుదురుతున్న కాస్టింగ్, వాటి బడ్జెట్లు, స్కేల్ లాంటివి చూస్తే అతడి రేంజ్ ఏంటన్నది అర్థమవుతుంది. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమాలోకి అమితాబ్ బచ్చన్ సైతం వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ప్రభాస్ చేయబోయే సినిమాకు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులే సెట్ అవుతున్నారు.
ప్రభాస్ రాముడిగా నటించనున్న ఈ సినిమాలో రావణుడి పాత్రకు సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సీత పాత్రకు రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ పాత్రలో ఎవరు నటించనున్నారో వెల్లడించబోతున్నారు. ఈలోపు ఈ ప్రాజెక్టులో కాస్టింగ్‌కు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ బయటికొచ్చింది. ఓం రౌత్ చివరగా తీసిన ‘తానాజీ’లో లీడ్ రోల్ చేసిన అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో ముఖ్యమైన అతిథి పాత్ర పోషించనున్నాడట. ఆయన ఆది శివుడిగా కనిపించనున్నట్లు సమాచారం.
రావణుడు శివుడికి పరమభక్తుడన్న సంగతి తెలిసిందే. ఈ కోణాన్ని ఎలివేట్ చేసేందుకు సినిమాలో శివుడు, రావణుడి మధ్య కొన్ని సన్నివేశాలు పెడుతున్నారట. వీటి వెయిట్ పెంచేందుకు శివుడిగా అజయ్‌ను తీసుకున్నారట. తనకు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఓం రౌత్ కోసం ఈ పాత్ర చేయడానికి అజయ్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో ‘ఆదిపురుష్’కు సంబంధించి ఏదైనా అప్‌డేట్ ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on October 12, 2020 4:04 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…