Movie News

టైమ్ లేదు రామ్ నందన్… పరిగెత్తాల్సిందే

గేమ్ ఛేంజర్ విడుదల దగ్గరవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లు ఊపందుకోవాల్సిన డిమాండ్ కు అనుగుణంగా దిల్ రాజు బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఇవాళ విజయవాడలో అతి పెద్ద రామ్ చరణ్ కటవుట్ కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటిదాకా ఇండియాలో ఎవరికి పెట్టనంత ఎత్తులో రూపొందించడం జాతీయ స్థాయి మీడియానూ ఆకర్షించింది. డిసెంబర్ 31 అన్ స్టాపబుల్ సీజన్ 4 కోసం బాలకృష్ణతో ముఖాముఖీలో చరణ్ పాల్గొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సిరీస్ లో అతి పెద్ద బ్లాస్టింగ్ ఎపిసోడ్ గా ఉంటుందని అప్పుడే దీని పట్ల అంచనాలు మొదలయ్యాయి.

జనవరి 1 లేదా 2 తేదీల్లో ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ లో చేయాలని చూస్తున్నారు కానీ నిర్ధారణగా ఈవెంట్ ఉంటుందా లేదానేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ సాధ్యం కాకపోతే నేరుగా ఆన్ లైన్ లో వదులుతారు. జనవరి 4 లేదా 5 తేదీ రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవిలో ఎవరు వస్తారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇవి పూర్తి చేసుకుని 6 నుంచి 8 తేదీల మధ్యలో చెన్నై, బెంగళూరు, ముంబైలో ప్రెస్ మీట్లు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. టైం చాలా తక్కువగా ఉండటంతో రామ్ నందన్ (పాత్ర పేరు) పరుగులు పెట్టాల్సి ఉంది.

సోలో రిలీజ్ కాకపోవడం వల్ల పోటీని తట్టుకోవడానికి గేమ్ ఛేంజర్ మాములు పబ్లిసిటీ చేసుకుంటే సరిపోదు. దేవర, కల్కి, పుష్ప 2లు దక్కించుకున్న అడ్వాంటేజ్ చరణ్ కు లేదు. పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి పండగ తోడై భారీ వసూళ్లు రాబట్టుకోవచ్చు. రేపు సెన్సార్ ఉండొచ్చని వినిపిస్తోంది కానీ ఖరారుగా తెలియాల్సి ఉంది. మాములుగా తమన్ తన రీరికార్డింగుల గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా గేమ్ ఛేంజర్ కు సంబంధించింది షేర్ చేయలేదు. పాటల గురించి ట్వీట్ల ద్వారా ప్రత్యేకంగా చెబుతున్నాడు. యుఎస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యాక అదే స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

This post was last modified on December 29, 2024 2:40 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డ్రగ్స్ వద్దు డార్లింగ్స్… ప్రభాస్ పిలుపు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి…

1 hour ago

ఏపీ పాలిటిక్స్ : 2024 పాఠం నేర్పిన తీరు.. !

2024.. మ‌రో రెండు రోజుల్లో చ‌రిత్ర‌లో క‌లిసిపోనుంది. అయితే.. ఈ సంవ‌త్స‌రం కొంద‌రిని మురిపిస్తే.. మ‌రింత మందికి గుణ‌పాఠం చెప్పింది.…

2 hours ago

జ‌గ‌న్ ఇంటికి కూత‌వేటు దూరంలో… జెండా పీకేసిన‌ట్టేనా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. నిన్న‌టి వ‌ర‌కు జేజేలు కొట్టి.. జ్యోతులు ప‌ట్టిన చేతులే.. నేడు క‌నుమ‌రుగు…

2 hours ago

నారా కుటుంబాన్ని రోడ్డెక్కించిన 2024 రాజ‌కీయం..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుటుంబం మొత్తం ఎప్పుడూ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ప‌రిస్థితి లేదు. ఆయ‌న కుమారుడు, ఆయ‌న కోడ‌లు బ్రాహ్మ‌ణి…

3 hours ago

2025లో బిజీబిజీగా టీమిండియా.. కంప్లీట్ షెడ్యూల్

2024 ముగిసిపోతోంది. ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు గొప్ప విజయాలతో పాటు కొన్ని నిరాశలకూ నిలిచింది. టీ20 వరల్డ్…

3 hours ago