2025 సంక్రాంతికి ఖరారుగా వస్తున్న సినిమాలు నాలుగు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పక్కా ప్లానింగ్ తో బెర్తు ఖరారు చేసుకోగా హడావిడిగా రేసులో తోడయ్యింది విడాముయార్చి. అజిత్ హఠాత్తుగా బరిలో దిగడంతో తమిళనాడులో రామ్ చరణ్ కు థియేటర్ల పరంగా వచ్చే చిక్కులను కొట్టిపారేయలేం. పైగా గ్యాప్ తర్వాత తలా చేసిన మూవీ కావడంతో కోలీవుడ్ లో భారీ రిలీజ్ దక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు రెడీ అవుతున్నారు. అలాని గేమ్ ఛేంజర్ నిర్లక్ష్యానికి గురవ్వడం లేదు కానీ బజ్ పరంగా కొంచెం టఫ్ ఫైట్ ని ఎదురు కోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోటీకోణంలో ఒక శుభవార్త ఉంది.
వాస్తవానికి విక్రమ్ వీర ధీర శూరన్ పార్ట్ 2ని పొంగల్ కే రిలీజ్ చేయాలని నిర్మాతలు గట్టిగా ట్రై చేశారు. దానికి అనుగుణంగానే ఆ మధ్య టీజర్ వదిలి ప్రమోషన్ ఇంటర్వ్యూలు చేశారు. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటం వల్ల వాయిదా తప్పదని చెన్నై టాక్. అసలే వీర ధీర శూరన్ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. చాలా కాలం తర్వాత పంచెకట్టులో చియాన్ విక్రమ్ మాస్ ని టార్గెట్ చేసుకున్నాడు. ప్రమోషన్లో చూపించిన కంటెంట్ కనెక్ట్ అవ్వడంతో బయ్యర్లు ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేకపోవడంతో దాని కోసం లాక్ చేయాలనుకున్న స్క్రీన్లు చరణ్, అజిత్ పంచుకుంటారు.
ఇదొక్కటే కాదు బాలా దర్శకత్వంలో రూపొందిన వనంగాన్ కూడా రావడం లేదు. దీని టీజర్ వచ్చి నెలలు దాటేసింది. సూర్య వదలుకున్నాక అరుణ్ విజయ్ చేసిన భారీ చిత్రమిది. సంక్రాంతికి రావడం అనుమానమేనని బయ్యర్లకు సమాచారం అందిందట. అజిత్ కు బెదిరి వద్దనుకున్నారో లేక గేమ్ ఛేంజర్ కూడా ఉంది కదా ఎందుకు రిస్క్ అనుకున్నారో కారణాలు ఏమైతేనేం ఇది కూడా చరణ్ కు ఊరట కలిగించేదే. ఇదేమో కానీ విక్రమ్ సినిమా వచ్చి ఉంటే తెలుగు డబ్బింగ్ కోసం కాసిన్ని థియేటర్లు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం తప్పింది. సంక్రాంతి అంటే అంత క్రేజ్ కాబట్టే ఇన్ని క్యాలికులేషన్లు.
This post was last modified on December 28, 2024 10:34 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…