‘పుష్ప…పుష్ప..పుష్ప..పుష్ప..పుష్ప రాజ్…’ అంటూ డిసెంబరు 4వ తేదీ నుంచి దేశమంతా ‘పుష్ప’ ఫీవర్ వైల్డ్ ఫైర్ లా వ్యాపించింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసులను ‘పుష్ప’ రూల్ చేశాడు. నీయవ్వ అస్సలు తగ్గేదేలే అంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కలెక్షన్ల సునామీలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్ప అరాచకం మామూలుగా లేదు. బాలీవుడ్ ప్రేక్షకులు తెలుగు డబ్బింగ్ సినిమా అయిన పుష్పను హిందీ సినిమా కంటే ఎక్కువగా ఆదరించి ఆల్ టైం రికార్డు కలెక్షన్లు కురిపించారు.
తాజాగా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేశాడు పుష్ప. బాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘పుష్ప: ది రూల్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. రూ.740.25 కోట్లు కలెక్షన్లు రాబట్టిను పుష్ప ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. అస్సలు తగ్గే్దేలే అంటూ రూ.1000 కోట్ల కలెక్షన్లపై పుష్ప కన్నేశాడు. అంతేకాదు, బాలీవుడ్ లో సినిమా విడుదలైన మూడు వారాల్లో వంద కోట్లు రాబట్టిన తొలి చిత్రంగా ‘పుష్ప: ది రూల్’ నిలిచింది.
ఈ క్రమంలోనే పుష్ప కలెక్షన్ల రికార్డులతోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనపై, టాలెంట్ పై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. ఒక తెలుగు డబ్బింగ్ చిత్రం బాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేయడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. ఆ హీరో హిందీలో కూడా మాట్లాడడని, హిందీ రాదని, టాలెంట్ ఉండి అద్భుతంగా నటించాడు కాబట్టే అల్లు అర్జున్ ను ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారని చెప్పారు.
అన్ని భాషలలో పుష్ప సూపర్ హిట్ అయిందంటే అల్లు అర్జున్ సాధించిన ఘనత సాధారణమైనది కాదని, అది చాలా గొప్ప విజయం అని సురేష్ బాబు ప్రశంసించారు. తెలుగు డబ్బింగ్ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని, అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడని, టాలెంట్ ఉంటేనే అది సాధ్యపడుతుందని చెప్పారు. అన్ని భాషల ప్రేక్షకులు కోరుకున్న కంటెంట్ పుష్ప ఇచ్చిందని అన్నారు.
This post was last modified on December 28, 2024 3:25 pm
2025 సంక్రాంతికి ఖరారుగా వస్తున్న సినిమాలు నాలుగు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పక్కా ప్లానింగ్ తో…
కొన్ని క్రేజీ కలయికలు తెరమీద చూడాలని ఎంత బలంగా కోరుకున్నా జరగవు. ముఖ్యంగా మల్టీస్టారర్లు. అందుకే ఆర్ఆర్ఆర్ కోసం జూనియర్…
పవన్ కళ్యాణ్ ఎంత పవర్ స్టార్ అయినా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బాధ్యతతో కొన్ని కీలక శాఖలు నిర్వహిస్తూ నిత్యం…
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగడం వల్ల వెంటనే లైవ్ చూసే అవకాశం అభిమానులకు లేకపోయింది. అక్కడ…
ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో…