Movie News

ఆ సినిమా సంచలనాలకు 20 ఏళ్లు

హీరో హీరోయిన్లు కొత్త వాళ్లు. దర్శకుడు అంత పేరున్న వాడేమీ కాదు. పరిమిత బడ్జెట్లో సినిమా తీశారు. చిన్న స్థాయిలోనే రిలీజ్ చేశారు. కానీ విడుదల తర్వాత ఆ సినిమా సృష్టించిన సంచనాలు అన్నీ ఇన్నీ కావు. సూపర్ స్టార్ల సినిమాలకు దీటుగా వసూళ్లు రాబట్టింది. 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు ఇలా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ వెళ్లింది.

పెద్ద సినిమాలు సైతం 100 రోజులు ఆడటం కష్టమైన చిన్న సెంటర్లలో ఆ చిత్రం 150 రోజులకు పైగా ఆడింది. ఒక విద్యా సంవత్సరం మధ్యలో విడుదలైన ఆ చిత్రం.. తర్వాతి ఏడాది కొత్త విద్యా సంవత్సరం పున:ప్రారంభం అయ్యే సమయానికి కూడా ఆడుతూనే ఉంది. ఒక తరగతిలో ఉండగా సినిమా చూసిన స్టూడెంట్స్ ఒక తరగతి పెరిగాక మళ్లీ బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వచ్చి సినిమా చూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 3 కోట్ల మందికి పైగా ఈ సినిమా చూశారంటే దీని స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ సినిమా ఏది అంటారా..? నువ్వేకావాలి.

2000వ సంవత్సరం అక్టోబరు 13న మామూలుగా విడుదలైన ‘నువ్వే కావాలి’ అప్పట్లో వెండితెరపై సాగించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా చూడకపోతే యూత్‌యే కాదు అన్న రీతిలో అబ్బాయిలు, అమ్మాయిలు విరగబడి ఈ సినిమా చూశారు. ‘నువ్వే కావాలి’ పాటలు, డైలాగులు, అందులో కామెడీ, ప్రేమ సన్నివేశాల గురించి ఇప్పుడు అడిగినా ఒకప్పటి యువ ప్రేక్షకులు చాలా ఎగ్జైట్ అవుతూ చెబుతారు. మలయాళంలో హిట్టయిన ‘నిరమ్’ చిత్రాన్ని చూసి ఇష్టపడ్డ స్రవంతి రవికిషోర్.. త్రివిక్రమ్‌తో మార్పులు చేర్పులు చేయించి స్క్రిప్టు రెడీ చేస్తే.. అప్పటికే త్రివిక్రమ్ సహకారంతో ‘స్వయంవరం’ లాంటి హిట్టిచ్చిన విజయభాస్కర్.. దాన్ని టేకప్ చేసి యువతను ఉర్రూతలూగించేలా ఈ స్నేహం-ప్రేమ కథను అద్భుతంగా మలిచారు.

రవికిషోర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో రామోజీ రావు ఈ సినిమాకు పెట్టుబడి పెట్టారు. విడుదల తర్వాత చిత్రం ఎవ్వరూ ఊహించని అద్భుత విజయాన్నందుకుని తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని తన పేరిట లిఖించుకుంది. ఎవరైనా పెద్ద హీరో సినిమా ఇలా ఆడి ఉంటే దాని రికార్డుల గురించి ఎంతగా ప్రచారం చేసుకునేవాళ్లో. రికార్డుల గురించి ఎంత గొప్పగా మాట్లాడుకునేవాళ్లో.

This post was last modified on October 12, 2020 3:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

3 hours ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

4 hours ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

5 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

6 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

6 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

6 hours ago