ఒక భాషలో హిట్టయిన సినిమాని రీమేక్ చేసుకోవడంలో ఎంతో సౌకర్యం ఉంటుంది. కాకపోతే ఒరిజినల్ వెర్షన్ కు దక్కిన ఫలితమే వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఒకప్పుడంటే ఓటిటిలు, ఇంటర్ నెట్ లేవు కాబట్టి చెల్లిపోయింది కానీ ఇప్పుడలా కాదు. ఫలానా తెలుగులోనో తమిళంలోనో ఒక హిట్ మూవీ వచ్చిందంటే చాలు వెతికి మరీ సబ్ టైటిల్స్ తో చూస్తున్న ప్రేక్షకులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచం మొత్తం కోట్లలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీటి ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వచ్చి నిర్మాతకు కనీసం పబ్లిసిటీ డబ్బులు కూడా రావు. ప్రస్తుతం బాలీవుడ్ ఇలాంటి సంకటాన్నే ఎదురుకుంటోంది.
గత రెండు మూడేళ్ళను పరిగణనలోకి తీసుకుంటే రీమేకుల్లో హిట్ అయిన సినిమాలు రెండే కనిపిస్తాయి. ఒకటి షైతాన్, మరొకటి దృశ్యం 2. మిస్ ఫైర్ అయినవి మాత్రం లెక్కలేనన్ని ఉన్నాయి. వాటివైపు ఒక లుక్ వేస్తే తడప్ (ఆరెక్స్ 100), నికమ్మ (నాని ఎంసీఏ), బచ్చన్ పాండే (గద్దలకొండ గణేష్), షెహ్జాదా (అల వైకుంఠపురములో), కిసీకా భాయ్ కిసీకా జాన్ (కాటమరాయుడు), గుంరా (రెడ్), సర్ఫిరా (ఆకాశం నీ హద్దురా), ఛత్రపతి (ఛత్రపతి), లాల్ సింగ్ చద్దా (ఫారెస్ట్ గంప్), భోళా (ఖైదీ), మిలి (హెలెన్), సెల్ఫీ (డ్రైవింగ్ లైసెన్స్) ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే వెళ్తూనే ఉంటుంది తప్ప ఆగదు. ఇవన్నీ అల్ట్రా డిజాస్టర్లే.
ఇటీవలే బేబీ జాన్ (తేరి) కూడా ఈ కోవలోకి చేరేందుకు పరుగులు పెడుతోంది. వరుణ్ ధావన్ ని సూపర్ స్టార్ చేస్తానని చెప్పిన దర్శకుడు అట్లీ నిర్మాతగా మారి కుర్రాడితో పాటు కీర్తి సురేష్ కి పెద్ద షాక్ ఇచ్చాడు. ముంబై విశ్లేషకులు వీలైనంత త్వరగా తమ దర్శక నిర్మాతలు రీమేకులు ఆపాలని కోరుకుంటున్నారు. పుష్ప 2 ది రూల్ కు దక్కుతున్నఆదరణ చూశాకైనా హీరో పరిచయం, ఇమేజ్ తో సంబంధం లేకుండా ఉత్తరాది ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, కాంతార లాంటివి రికార్డులు సృష్టించడానికి కారణాలు రివ్యూ చేసుకోమంటున్నారు.
This post was last modified on December 28, 2024 12:54 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…