Movie News

ఎస్ఎస్ఎంబి 29 – అంతుచిక్కని రాజమౌళి సెలక్షన్

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట వినిపిస్తోంది కానీ ఫలానా డేట్ అంటూ ఏదీ బయటికి రావడం లేదు. సంక్రాంతికి ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తుండగా జక్కన్న ప్రస్తుతం లొకేషన్ల వేటలో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీ, గండిపేట, అల్యూమినియం ఫ్యాక్టరీ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని సెట్లు సిద్ధం చేసుకోగా ఔట్ డోర్ ఎక్కడికి వెళ్లాలనే దాని మీద కసరత్తు జరుగుతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని టీమ్ మొత్తం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు. ఈలోగా కొన్ని ముఖ్యమైన లీకులు వైరల్ అవుతున్నాయి.

వాటిలో ప్రధానమైంది ప్రియాంకా చోప్రాని మెయిన్ లీడ్ గా తీసుకున్నారనే టాక్. నిజానికిది ఊహించని కాంబో. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక విదేశాలకు వెళ్ళిపోయిన ప్రియాంక రెగ్యులర్ హీరోయిన్ గా చేయడం మానేసింది. సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ తో పాటు పలు హాలీవుడ్ మూవీస్ చేసింది కానీ తననే కోరుకునే దర్శకులు బాలీవుడ్ లోనూ లేరు. మరి రాజమౌళి ఏరికోరి ఆమెనే తీసుకోవడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందేమో చూడాలి. నిజానికిది అఫీషియల్ న్యూస్ కాదు. ఆ మాటకొస్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన లేదు. నమ్మదగిన వర్గాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి అంతే.

విలన్ గా పృథ్విరాజ్ సుకుమారన్ కూడా దాదాపు లాకైనట్టే అంటున్నారు. వీలైనంత వరకు గుట్టుగా పని చేసుకోవడం రాజమౌళి స్టైల్. ఇప్పుడూ అదే పాటిస్తున్నారు. కాకపోతే ఏదో ఒక రూపంలో కొన్ని బయటికి వస్తున్నాయి. రెండేళ్లలోపే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న జక్కన్న అన్నమాట ప్రకారం దాన్ని నిలబెట్టుకుంటారో లేదో పరిస్థితులు నిర్ణయిస్తాయి. గతంలో ఆర్ఆర్ఆర్ టైంలోనూ అంతా ప్లాన్ ప్రకారం తీయాలనుకున్నా రెండుసార్లు కోవిడ్ అడ్డుపడి ఆలస్యం చేసింది. ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకపోతే ఎస్ఎస్ఎంబి 29కి ఇంకో రెండేళ్లలో చూడొచ్చు. 2027 రిలీజ్ అయితే గ్రేటే అనుకోవాలి.

This post was last modified on December 28, 2024 10:41 am

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

29 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

57 minutes ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

9 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

12 hours ago