బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు పెరుగుతాయి. ఇది ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే మోసం వస్తుంది. కీర్తి సురేష్ కు ఇప్పుడిది అనుభవమవుతోంది. వరుణ్ ధావన్ జోడిగా చేసిన బేబీ జాన్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. నిజానికి ఎంట్రీ ఇవ్వాల్సింది ఇలాంటి క్యారెక్టర్ తో కాదు. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ తేరిలో సమంతా కూడా చనిపోయే పాత్రే చేసింది. కానీ అది విజయ్ ఇమేజ్, ఎలివేషన్ల మీద నడిచే కథ కావడంతో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ వరుణ్ కి ఉన్న ఇమేజ్ అంతటి పుల్ సాధించలేడనేది వాస్తవం.
అలాంటప్పుడు కీర్తి సురేష్ రెండు పాటల్లో డాన్స్ చేసి చనిపోయే క్యారెక్టర్ ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరవ్వడం కష్టం. అసలే బేబీ జాన్ ఊర మాస్ మసాలా సినిమా. అట్లీ అడిగాడు కదాని చేసింది కానీ దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించి ఉండదు. పైగా ఇదేదో పెద్ద బ్రేక్ అవుతుందని భావించి పెళ్లి జరిగిన వెంటనే ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లలో పాల్గొనడం కీర్తి సురేష్ కి ఎలాంటి బెనిఫిట్ ఇవ్వలేకపోయింది. బేబీ జాన్ లో మరో హీరోయిన్ వామికా గబ్బి పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా లేకపోయినా నిడివి, ప్రాధాన్యత పరంగా కొంచెం బెటర్ అనిపించుకుంది తప్ప బెస్ట్ అయితే కాదు.
గతంలో ఇలా హిందీ తెరంగేట్రంలో షాకులు తిన్న సౌత్ హీరోయిన్లు బాగానే ఉన్నారు. షాలిని పాండే, త్రిష, కాజల్ అగర్వాల్, శ్రియ శరన్, తమన్నా భాటియా లాంటి వాళ్ళు ఏదో ఒకటి రెండు హిట్లు తప్ప తమదైన ముద్ర వేయలేకపోయారు. డెబ్యూనే నార్త్ లో మొదలుపెట్టిన పూజా హెగ్డేకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ అక్కడ లేదు. కానీ తెలుగులో ఇండస్ట్రీ హిట్లున్నాయి. దూరపు కొండలు నునుపు తరహాలో ఏదో పెద్ద బ్రేక్ దొరుకుతుందని వెళ్లి వెనక్కు వచ్చే బాపతే ఎక్కువగా కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే కీర్తి సురేష్ కి బాలీవుడ్ ఎంట్రీ సారీ బేబీ అయిపోయింది.
This post was last modified on December 27, 2024 6:38 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…