Movie News

బన్నీ నిర్ణయం కరెక్టని ఋజువైనట్టే

ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని గురించి మాట్లాడేందుకు ఏం లేదు కానీ ఇది సినిమాకు సంబంధించి. పుష్ప 2 ది రూల్ షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు అట్లీ బన్నీతో ప్రాజెక్టు లాక్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించినట్టు టాక్ వచ్చింది. టీమ్ తో కలిసి స్టోరీ డిస్కషన్ చేస్తున్న ఫోటో ఒకటి అట్లీ భార్య ప్రియా ఓసారి షేర్ చేయడంతో నిజమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఫ్యాన్స్ భావించారు. షారుఖ్ ఖాన్ కి జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆనందంలో అట్లీ ఆ టైంలో మాములు దూకుడుగా లేదు.

ఏమయ్యిందో కానీ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేకుండా అంతా గప్ చుప్ అయ్యింది. ఏమయ్యిందో కనుక్కోవడానికి ప్రయత్నిస్తే స్టోరీ పరంగా అట్లీ చెప్పిన నెరేషన్ బన్నీని సంతృప్తిపరచలేదనే మాట అంతర్గతంగా వినిపించింది. ఇదంతా లోలోపల జరిగింది కాబట్టి ఎలాంటి అధికారిక ముద్ర లేదు. కట్ చేస్తే ఇప్పుడు బేబీ జాన్ బాలీవుడ్ ఆల్ టైం ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది. పేరుకి దర్శకుడు కలీస్ అయినప్పటికీ కర్త, కర్మ, క్రియ, నిర్మాతగా సర్వం చూసుకుంది అట్లీనే. ఎందుకంటే తేరి రీమేక్ కాబట్టి. వరుణ్ ధావన్ సూపర్ స్టార్ అవుతాడనే పెద్ద స్టేట్ మెంట్ కూడా అట్లీ ఇచ్చాడు.

తీరా చూస్తే బేబీ జాన్ నిరాశపరిచింది. నిజానికి అట్లీ గతంలో తీసిన సినిమాల కంటెంట్ మీద విమర్శలున్నాయి. అవి కమర్షియల్ గా సక్సెస్ కావడంతో మార్కెట్ పెరిగింది. గ్రాండియర్ పూతలో చాలా రొటీన్ కంటెంట్, గతంలో వచ్చిన కథలే మళ్ళీ తీస్తాడనే కామెంట్ ని అంత సులభంగా కొట్టిపారేయలేం. శంకర్ ముద్ర తన మీద బలంగా ఉంది. సో పుష్పతో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో బన్నీ రాజీ పడటం లేదు. అందుకే అట్లీని గుడ్డిగా నమ్మకపోయి ఉండొచ్చు. సల్మాన్ ఖాన్ తో త్వరలో చేతులు కలపబోతున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఈసారైనా రూటు మారుస్తాడో లేదో చూడాలి.

This post was last modified on December 27, 2024 3:28 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago