దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం చేసినా ఆలోచించి అడుగులు వేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా తమ్మా రెడ్డి పుష్ప-2 వివాదంపై స్పందించారు. నిజానికి ఈ ఘటన ఈ నెల 4న జరిగింది. ఆ తర్వాత.. అనేక మలుపులు కూడా తిరిగింది. కానీ, ఇన్నాళ్లు మౌనంగా ఉన్న భరద్వాజ ఇప్పుడు అనూహ్య వ్యాఖ్యలు చేశా రు. ఆయన చేసిన వ్యాఖ్యలు.. చర్చనీయాంశం అయ్యాయి.
హీరోలు కూడా సాధారణ పౌరులేనని.. వీరు కూడా కామన్‌గా ఉండే అన్ని అంశాలకు అతీతులు కారని వ్యాఖ్యానించారు. కానీ, ఈ విషయాన్ని కొందరు మరిచిపోతున్నారని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. పుష్ప2 ప్రీమియర్ షో కు ఎలాంటి హడావుడీ లేకుండా వెళ్లి ఉంటే.. స్టాంపేడ్ జరిగేది కాదన్నారు. ప్రీమియర్ షోలకు వెళ్లడం.. అభిమానులను కలుసుకోవడం హీరోలకు కొత్తకాదని.. కానీ, చేసిన ప్రచారమే తాజా పరిస్థితిని సీరియస్ చేసిందన్నారు.
“హీరోలు ఎక్కడికి వెళ్లినా నాలుగు కార్లలో వెళ్లాలని, రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి సర్వ సాధారణంగా మారిపోయాయి” అని తమ్మారెడ్డి అన్నారు. అసలు ఎందుకింత హంగామా ? అని ప్రశ్నించారు. సైలెంట్‌గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. కానీ.. ఏదో హంగామా చేయడం ద్వారానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్టు చెప్పారు. గతంలోనూ చిరు, బాలయ్యలు తొలి షో చూసేందుకు వెళ్లినా.. హంగామా చేసేవారు కాదన్నారు.
ధరలు పెంచి ..
హీరోల రెమ్యూనరేషన్ భారం అంతా ప్రేక్షకులపైనే పడుతోందని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ ఇచ్చే సంస్కృతి పెరిగిందన్నారు. అందుకే.. సగటు ప్రేక్షకుడు ఈ భారం భరించాల్సి వస్తోందన్నారు. అసలు కలెక్షన్ల పరంగా.. సొమ్ముల పరంగా ఒక సినిమాకు పేరు రావడం కాదని.. నటన పరంగా.. తెలుగు సినిమాకు పేరు రావాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
This post was last modified on December 27, 2024 3:10 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…