సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ రోజుతో అల్లు అర్జున్ కు జ్యుడీషియల్ రిమాండ్ పూర్తి కానుంది. ఈ క్రమంలోనే రెగ్యులర్ బెయిల్ కోరుతూ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. మరోవైపు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు విచారణను నాంపల్లి కోర్టు జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి అల్లు అర్జున్ తరఫు లాయర్లు తీసుకువచ్చారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ జ్యుడీషియల్ రిమాండ్ పై తదుపరి విచారణను కూడా జనవరి 10కి కోర్టు వాయిదా వేసింది. వాస్తవానికి ఈ రోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అల్లు అర్జున్ కోర్టుకు వస్తారన్న నేపథ్యంలో అక్కడ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
అయితే, వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అల్లు అర్జున్ కు అనుమతినివ్వాలని న్యాయమూర్తిని ఆయన తరఫు లాయర్లు కోరారు. న్యాయమూర్తి అనుమతినివ్వడంతో వర్చువల్ గా అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు.
This post was last modified on December 27, 2024 1:38 pm
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…