ఇటీవలే విడుదలైన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నిర్మాత చెప్పినట్టు పుష్ప 2 గ్రాస్ ని దాటేంత రేంజ్ లో ఆ సినిమా ఉండే మాట అటుంచి కనీసం ఓ మాదిరి ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేక నీరసంగా మొదలయ్యింది. పోనీ టాక్ వస్తే ఇలాంటివి క్రమంగా నిలదొక్కుకుంటాయి కానీ కంటెంట్ ఆ స్థాయిలో లేక వెళ్లిన కాసిన్ని ప్రేక్షకులను నిరాశ పరుస్తోంది. పోస్టర్లలో హైలెట్ అయిన వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ లో కనిపించలేదు. ఎందుకని టీమ్ ని అడిగితే విదేశాల్లో ఉన్నాడని ఒకసారి, బయట కనిపించడం ఇష్టం ఉండదని మరోసారి కవర్ చేశారు. కానీ హీరో వెర్షన్ ఇంకోలా ఉండటం జనాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ముందు చిన్న పాత్రని చెప్పి పొడిగించుకుంటూ పోయారని తర్వాత నువ్వు హీరోనాని వేరే ఆర్టిస్టు అడిగే వరకు డౌట్ రాలేదని చెప్పినట్టుగా వచ్చిన వార్త అనుమానం రేకెత్తించింది. ఏది ఎలా ఉన్నా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఫలితం ముందే ఊహించి వెన్నెల కిషోర్ పబ్లిసిటీ దూరంగా ఉన్నాడేమోననే అనుమానం రావడం సహజం. 1991 అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగిన తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో జరిగిన ఒక మర్డర్ ని ఆధారంగా చేసుకుని దర్శకుడు రైటర్ మోహన్ ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తీశాడు. పాయింట్ ఓకే అయినప్పటికీ కథనంతో సహా ఏ అంశమూ గ్రిప్పింగ్ గా నిలవలేకపోయింది.
వెన్నల కిషోర్ కంటే అనన్య నాగళ్ళకే పెర్ఫార్మన్స్ పరంగా ఎక్కువ స్కోప్ దక్కడం అసలు ట్విస్ట్. కమెడియన్లను హీరోలుగా పెట్టి సినిమాలు చేసేటప్పుడు స్క్రీన్ ప్లే, మలుపులు పకడ్బందీగా ఉండాలి. లేదంటే తేడా కొట్టేస్తుంది. అసలే ఇది సోషల్ మీడియా కాలం. ఒక్క చిన్న చిత్రం నిలబడాలన్నా పడిపోవాలన్నా దీని పాత్ర చాలా కీలకం. అంతే తప్ప వైరల్ స్టేట్ మెంట్లు ఇస్తే ఆడియన్స్ థియేటర్లకు రారు. అదే రోజు పోటీగా ఉన్న మోహన్ లాల్ బరోజ్ 3డి డిజాస్టర్ అయినా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ దాన్ని అవకాశంగా వాడుకోలేకపోవడం ట్రాజెడీ. చారి 111 తర్వాత వెన్నెల కిషోర్ కు మరో షాక్ కొట్టింది.
This post was last modified on December 27, 2024 11:49 am
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…