గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ కాంపిటీషన్ ఉందండోయ్. సోనూ సూద్ హీరోగా నటించిన ఫతే జనవరి 10న రిలీజ్ కానుంది. దీనికి పెద్ద బడ్జెట్ పెట్టారు. పుష్ప 2 తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కు జోష్ తెచ్చే సినిమా ఇదే అవుతుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. అయితే సోను సూద్ కు రామ్ చరణ్, చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. ఆచార్యలో మెయిన్ విలన్ గా నటించిన సమయంలో వాళ్ళిద్దరితో ర్యాపొ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన సంఘటనను సోను స్వయంగా వివరించారు.
ఇటీవలే బెంగళూరు ఎయిర్ పోర్ట్ లాంజ్ లో చిరంజీవిని సోను సూద్ అనుకోకుండా కలిశాడు. దగ్గరుండి ఫతే ట్రైలర్ చూపించాడు. ఇప్పటిదాకా ఇలాంటి కంటెంట్ చూడలేదనిపించేలా ఉందని, నావైపు నుంచి ఏదైనా ప్రమోషన్ పరంగా సహాయ పడగలిగితే అడగమని చెప్పడంతో అరుంధతి విలన్ సంతోషం ఒక్కసారిగా రెట్టింపయ్యింది. పోటీ గురించి సోను సూద్ మాట్లాడుతూ తనకేం ఆందోళన లేదని, గతంలో ఒకేసారి లగాన్, గదర్ లాంటివి ఒకే రోజు రిలీజైనా రికార్డులు సృష్టించాయని, సినిమా బాగుంటే ప్రేక్షకులు పండగ సీజన్ లో ఆదరించేందుకు సిద్ధంగా ఉంటారని పలుమార్లు రుజువయ్యిందని చెప్పుకొచ్చాడు.
ఫతే అసలు విశేషం వేరే ఉంది. ఇది సోను సూద్ స్వయంగా రాసుకుని దర్శకత్వం వహించిన సినిమా. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించింది. ఒక అమ్మాయికి బాడీ గార్డ్ గా ఉండాల్సి వచ్చిన హీరో ఈ క్రమంలో ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను ఎదురుకుంటాడు. వాటి నుంచి ఎలా బయటపడ్డారనే పాయింట్ తో పక్కా కమర్షియల్ జానర్ లో తెరకెక్కించాడు. నసీరుద్దీన్ షా, విజయ్ రాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్టులున్నారు. కరోనా సమయంలో వందలాది మందికి సహాయం చేసి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్న సోను సూద్ మరి గేమ్ ఛేంజర్ పోటీని తట్టుకుని ఎలా నిలబడతాడు అనేది ఆసక్తికరం.
This post was last modified on December 26, 2024 6:53 pm
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…