సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన పలు కీలక అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వారు ప్రస్తావించారు. అయితే, ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, అడ్వాన్స్ ప్రీమియర్ లు, టికెట్ రేట్ల పెంపు ఉండవని రేవంత్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు.
సినిమా టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు, సంక్రాంతికి విడుదల కాబోతోన్న సినిమాలు ముఖ్యం కాదని దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇండస్ట్రీ గ్రోత్ పైనే చర్చ జరిగిందని, టిక్కెట్ రేటు, బెనిఫిట్ షోల పై చర్చ జరగలేదని దిల్ రాజ్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం అందుతోందని, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించామని అన్నారు.
హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని దిల్ రాజు చెప్పారు.సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో టాలీవుడ్కు, ప్రభుత్వానికి గ్యాప్ వచ్చిందన్న టాక్ సరికాదని, అలాంటిదేమీ లేదని దిల్ రాజు చెప్పారు. సీఎంతో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని అన్నారు. డ్రగ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫోకస్ పెట్టమని సీఎం కోరారని, హీరోలు, హీరోయిన్స్ ఆ కార్యక్రమాలకు సహకరిస్తారని సీఎంకు చెప్పామని దిల్ రాజు వెల్లడించారు.
This post was last modified on December 26, 2024 2:11 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…