సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం ఓపెనింగ్స్ అరాచకం ఖాయమని అభిమానులు ఎదురు చూస్తున్నారు. డాకు మహారాజ్ కు రెండు రోజులు, సంక్రాంతికి వస్తున్నాంకు నాలుగు రోజులు గ్యాప్ ఉండటం ఎంతైనా సానుకూలాంశం. అయితే ఇక్కడితో హమ్మయ్యా అనుకోవడానికి లేదు. ఎందుకంటే తెలుగులో సమస్య లేదు కానీ తమిళంలో మాత్రం అజిత్ తో నేరుగా క్లాష్ అయ్యే రిస్క్ చరణ్ కు తప్పేలా లేదు. విడాముయార్చిని జనవరి 10కే ప్లాన్ చేస్తున్నారని చెన్నై టాక్.
అదే జరిగితే గేమ్ ఛేంజర్ తమిళ వెర్షన్ కు థియేటర్ల పరంగా చిక్కులు తప్పవు. ఎందుకంటే అజిత్ క్రేజ్ దృష్ట్యా తమిళనాడు, కేరళలో ఎక్కువ స్క్రీన్లు తనకు కేటాయించేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపిస్తారు. హైప్ పరంగా విడాముయార్చి వెనుకబడి ఉంది కానీ ఇంకో మూడు నాలుగు రోజుల్లో మొదలుపెట్టే ప్రమోషన్లతో దాన్ని పెంచేందుకు లైకా పక్కా ప్రణాళికతో ఉందట. నిజానికి పొంగల్ రేసులో గుడ్ బ్యాడ్ అగ్లీని దింపాలని మైత్రి మేకర్స్ శతవిధాలా ప్రయత్నించింది. కానీ విడాముయార్చి ఇప్పటికే విపరీతమైన ఆలస్యం కావడంతో అజిత్ ప్రాధాన్యం దీనివైపే మొగ్గు చూపింది. దీంతో నెంబర్ మారిపోయింది.
ఈ లెక్కన చరణ్ పోటీపడాల్సిన లిస్టులో బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు అజిత్ కూడా తోడవ్వబోతున్నాడు. ట్విస్ట్ ఏంటంటే విడాముయార్చి షూటింగ్ ఇంకా అయిపోలేదు. చివరి దశ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా చేయాల్సి ఉంది. టీజర్ కు ఆశించిన స్పందన రాలేదు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ రోడ్ థ్రిల్లర్ లో యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కెసెండ్రా ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగు డబ్బింగ్ కి పెద్ద ఎత్తున కాకపోయినా కాసింత డీసెంట్ నెంబర్లలో రిలీజ్ చేస్తారు. ఓవర్సీస్ లోనూ అజిత్ ప్రభావం కాసింత బలంగానే ఉంటుంది. చూడాలి.
This post was last modified on December 25, 2024 7:16 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…