స్టార్ డైరెక్టర్ల చూపు ఎప్పుడూ స్టార్ హీరోల మీదే ఉంటుంది. ఒకవేళ చిన్న, మీడియం రేంజ్ కథానాయకులతో సినిమాలు చేయాలని వాళ్లనుకున్నా అదంత సులువైన విషయం కాదు. అందుకే అనివార్యంగా పెద్ద హీరోలతో బడా ప్రాజెక్టులే చేస్తుంటారు. రాజమౌళి ‘మగధీర’ తర్వాత కొంచెం రూటు మార్చి మర్యాదరామన్న, ఈగ లాంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చేశాడు.
ఒక స్థాయి అందుకున్నాక పెద్ద స్టార్లతోనే సినిమాలు చేసిన త్రివిక్రమ్.. మధ్యలో కొంచెం స్లంప్‌లో ఉన్న టైంలో నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోతో ‘అఆ’ తీశాడు. ఇక కొన్నేళ్లుగా పెద్ద హీరోలతోనే సాగుతున్న సుకుమార్.. ‘పుష్ప’తర్వాత కొంచెం వీలు చేసుకుని విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్నాడు. మరో అగ్ర దర్శకుడు కొరటాల శివ విషయానికి వస్తే.. తొలి సినిమా నుంచి బడా హీరోలతోనే ప్రయాణం సాగిస్తున్న ఆయన, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా పనిలో ఉంటూనే ఆయన ఓ చిన్న హీరో కోసం కథ రాయడం విశేషం. ఆ హీరో యంగ్, టాలెంటెడ్ నవీన్ పొలిశెట్టి కావడం విశేషం. ఐతే అతడితో కొరటాల చేయబోయేది సినిమా కాదు.. వెబ్ సిరీస్. దీనికి స్క్రిప్టు అందిస్తున్నది కొరటాలే కానీ దర్శకత్వం మాత్రం ఆయన చేయట్లేదట. కానీ కథ అందించడంతో పాటు నిర్మాణమూ కొరటాలే చేపట్టనున్నట్లు సమాచారం. ఒక ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కోసం ఇది తెరకెక్కనుందట.
టీనేజీలో అపరిపక్వమైన ప్రేమల వల్ల జీవితాలు ఎలా డిస్టర్బ్ అవుతాయనే కథాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు సమాచారం. తన అసిస్టెంటుతో ఈ వెబ్ సిరీస్ చేయిస్తున్నాడట కొరటాల. తక్కువ బడ్జెట్లో, టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో ఈ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో మంచి గుర్తింపు సంపాదించిన నవీన్ చేతిలో ఇప్పటికే రెండు మూడు సినిమాలున్నాయి.
This post was last modified on October 12, 2020 1:54 pm
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…