అతిలోక సుందరిగా పేరు తెచ్చుకుని కోట్లాది మంది కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన శ్రీదేవి.. అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం. శ్రీదేవిని ఒక దేవతలా ఆరాధించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాను ఆమెకు తగననే ఉద్దేశంతో ఎప్పుడూ తన ఇష్టాన్ని ఆమెకు చెప్పలేదని, బోనీని పెళ్లాడాక మాత్రం తాను ఆమెకు ప్రపోజ్ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు ఓ సందర్భంలో.
ఐతే తాను తొలిసారి శ్రీదేవి దగ్గర పెళ్లి ప్రతిపాదన చేసినపుడు ఆమెకు చాలా కోపం వచ్చిందని.. తనను తిట్టిపోసిందని.. తనతో ఆరు నెలలు మాట్లాడలేదని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బోనీ వెల్లడించాడు. ఆమెతో పాటు తన భార్యకు కూడా సర్దిచెప్పి ఒప్పించాకే తాను శ్రీదేవిని పెల్లాడినట్లు ఆయన తెలిపాడు. శ్రీదేవితో ప్రేమ, పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే..‘‘ప్రేమ, పెళ్లి విషయంలో శ్రీదేవిని ఒప్పించడానికి నాకు ఆరు నెలలు పట్టింది. తొలిసారి నేను ప్రపోజ్ చేసినపుడు ఆమె నన్ను బాగా తిట్టింది.
దాదాపు ఆరు నెలలు నాతో మాట్లాడలేదు. మీకు పెళ్లి ఇద్దరు పిల్లలున్నారు, ఇప్పుడు నాతో ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ నా మనసులోని భావాలను ఆమెకు పూర్తిగా తెలియజేశా. చివరకు ఆమె అంగీకరించింది. విధి మాకు అంగీకరించింది. ఈ భూమి మీద ఎవరూ పర్ఫెక్ట్ కాదు. శ్రీదేవితో ప్రేమలో పడడానికి ముందే నాకు పెళ్లి అయింది. పిల్లలున్నారు. ఈ విషయాన్ని నేను ఎక్కడా దాచలేదు. నా ప్రేమ గురించి నా మొదటి భార్య మోనాకు, పిల్లలకు కూడా వివరించా. వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. విషయం ఏదైనా సరే.. మన భాగస్వామి, పిల్లలతో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలన్నది నా ఫీలింగ్. శ్రీదేవిని నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా. నా చివరి క్షణం వరకు తన జ్ఞాపకాలతోనే ఉంటా’’ అని బోనీ చెప్పాడు.
శ్రీదేవి కెరీర్ పీక్స్‌లో ఉండగా బోనీతో పరిచయం జరిగింది. 1996లో వీరు పెళ్లి చేసుకున్నారు. 2018లో శ్రీదేవి దుబాయ్‌లో ఉండగా హఠాత్తుగా చనిపోయారు. ఆమె మరణంపై అప్పట్లో పలు సందేహాలు తలెత్తాయి. బోనీ మీద కూడా అనుమానాలు రేకెత్తాయి. కానీ ఆమె అనారోగ్యం వల్లే మరణించారని విచారణలో తేలింది.
This post was last modified on December 25, 2024 4:59 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…