సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందడం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరిగా రియాక్ట్ కాలేదని, శ్రీ తేజ్ ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదని కాంగ్రెస్ నేతలు కొందరు విమర్శించారు. కానీ, తనను ఆస్పత్రి దగ్గరకు వెళ్లొద్దని లాయర్లు చెప్పడంతోనే ఆగానని అల్లు అర్జున్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు పోలీసుల విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.
ఈ రోజు దాదాపు 3 గంటల పాటు అల్లు అర్జున్ ను పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ లో తొక్కిసలాట నాటి వీడియోలను అల్లు అర్జున్ కు పోలీసులు చూపించి పలు ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా ఆ వీడియోలు చూసిన బన్నీ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది. తొక్కిసలాటలో రేవతి చనిపోవడం, శ్రీ తేజ్ గాయపడడం తలుచుకొని బన్నీ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.
అయితే, ప్రెస్ మీట్ సందర్భంగా రేవతి మరణం, శ్రీ తేజ్ గాయపడడం గురించి మాట్లాడుతూ బన్నీ తన ఎమోషన్ ను వ్యక్తపరిచారని, కానీ, దానిని కొందరు అపార్థం చేసుకున్నారని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. ఆ ఘటన అల్లు అర్జున్ ను ఎంతో బాధించిందని, కానీ, దానిని అర్థం చేసుకోకుండా కొందరు బన్నీని టార్గెట్ చేసి మాట్లాడుతుండడంతో వివరణనిచ్చే ప్రయత్నం బన్నీ చేశారని చెబుతున్నారు. అల్లు అర్జున్ నిజంగా షాక్ లో ఉన్నారని, ఆ క్రమంలో మాట్లాడిన మాటలను కొందరు వక్రీకరించారని అంటున్నారు.
This post was last modified on December 24, 2024 9:26 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…